Allu Arjun, Ram Charan: స్టార్‌ రూటు విశాఖపట్నానికి… ఎవరెవరు దేనికోసమంటే?

విశాఖపట్నంలో సినిమాల షూటింగ్‌ జరగడం పెద్ద కొత్తేం కాదు. ఇటీవల కాలంలో మన సినిమాల షూటింగ్‌ అక్కడ ఎక్కువగా అవుతోంది. అలాగే స్టార్‌ హీరోలు కూడా బీచ్‌ సిటీకి వెళ్తున్నారు. అయితే ఇద్దరు అగ్ర హీరోలు ఇప్పుడు అక్కడ మకాం వేయడం ఆసక్తికరంగా మారింది. అందులోనూ ఇద్దరూ బావాబామ్మర్దులు కావడం గమనార్హం. సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు ఆ హీరోలు (Allu Arjun) అల్లు అర్జున్‌,(Ram Charan) రామ్‌చరణ్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే సోషల్‌ మీడియాలో ఇప్పుడు దాని గురించే డిస్కషన్‌.

అవును, స్టార్‌ కథానాయకులు అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ సినిమాల చిత్రీకరణ విశాఖపట్నంలో జరగనున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్‌ విశాఖపట్నానికి చేరుకోగా, త్వరలో రామ్‌ చరణ్‌ రంగంలోకి దిగుతాడట. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్ని వైజాగ్‌లో తెరకెక్కించనున్నారట. వారంపాటు సాగనున్న ఈ షెడ్యూల్‌ కోసం ఆదివారం అల్లు అర్జున్‌ విశాఖ చేరుకున్నాడు.

ఇక రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు (Shankar) శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం (Game Changer) ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా చిత్రీకరణని విశాఖపట్నంలో నిర్వహించడానికి చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ షూట్‌ కోసం ఈ వారంలో రామ్‌ చరణ్‌, ఇతర తారాగణం వాల్తేరు చేరుకుంటారు. రాజకీయాంశాలతో కనెక్ట్‌ అయిన ఉన్న ఈ కథలో రామ్‌చరణ్‌ ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తాడు. ఎన్నికల నిర్వహణ అనే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆ సన్నివేశాలే వైజాగ్‌లో తీస్తారు అంటున్నారు.

బన్నీ, చరణ్‌ మధ్య ఎంత పోటీ ఉందో తెలియదు కానీ.. వాళ్ల ఫ్యాన్స్‌ మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు బన్నీ కోసం అయితే ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చి మరీ స్వాగతం పలికారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరిప్పుడు రామ్‌ చరణ్‌ వచ్చేటప్పుడు వాళ్ల అభిమానులు ఇంకెంత సందడి చేస్తారో చూడాలి. నిన్నటి లాగే ఈ వారంలో మరోసారి విశాఖ ఎయిర్‌పోర్ట్‌ అభిమానులతో నిండిపోతుందని చెప్పొచ్చు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.