
మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాంచరణ్.. ‘ఆచార్య’ లో (Acharya) కీలక పాత్ర చేసినా, ‘కిసి క భాయ్ కిసి క జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) వంటి సినిమాలో కేమియో ఇచ్చినా.. కానీ ఫుల్ లెంగ్త్ హీరోగా చేస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ అనే సంగతి తెలిసిందే. శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నత్త నడకలా సాగుతుంది. 3 ఏళ్ళ నుండి ఈ సినిమా షూటింగ్ 70 శాతం మాత్రమే కంప్లీట్ అయ్యింది అంటే అర్థం చేసుకోవాలి.
నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా రిలీజ్ పట్ల చాలా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. 2024 దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతుననట్టు ప్రకటించారు కానీ.. అది ఇప్పుడు కుదిరేలా లేదు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఇటీవల వైజాగ్లో జరిగింది. ఓ కీలక షెడ్యూల్ ను అక్కడ నిర్వహించడం జరిగింది.ఇక షూటింగ్ గ్యాప్లో రాంచరణ్ ఫ్యామిలీ మెన్ అవతారం ఎత్తాడు.
తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో ఆర్.కె.బీచ్ లో బాగా ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండ్రీ కూతురు కలిసి మధ్యలో చేపలు పట్టేవాళ్ళ వద్ద.. వాటిని కొనుగోలు చేస్తున్నట్లు కూడా కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం రాంచరణ్ లేటెస్ట్ ఫ్యామిలీ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.
వైజాగ్ బీచ్ లో భార్య, కూతురితో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్
#RamCharan #Upasana #klinkaara #RamCharanBdayMonth #MassmaRCh #GlobalStarRamCharan #HBDGlobalStarRamCharan #GameChanger pic.twitter.com/WLUF1jEKGb
— Filmy Focus (@FilmyFocus) March 19, 2024
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?