వసూళ్లలో దూసుకెళుతున్న మలయాళ సినిమాలు.. సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఆశించిన స్థాయిలో లేదనే సంగతి తెలిసిందే. అయితే మలయాళ ఇండస్ట్రీలో ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలలో మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. ఈ సినిమాలు భాషతో సంబంధం లేకుండా సత్తా చాటాయి. ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం. ఈ సినిమాల రికార్డులు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ప్రేమలు  (Premalu) మూవీ రిలీజ్ కాగా ఈ సినిమాకు 120 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లు వచ్చాయి.

ఫిబ్రవరి నెల 15వ తేదీన భ్రమయుగం సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు 80 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావడం గమనార్హం. ఫిబ్రవరి నెల 22వ తేదీన మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) మూవీ థియేటర్లలో విడుదలైంది. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. మలయాళ దర్శకనిర్మాతలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథ, కథనంతో సినిమాలను తెరకెక్కించడం ద్వారా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ఇదే అక్కడి దర్శకనిర్మాతల సక్సెస్ సీక్రెట్ అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మలయాళ సినిమాల హవా కొనసాగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మలయాళ దర్శకుల ఆలోచన విధానం కొత్తగా ఉంది. మలయాళ దర్శకనిర్మాతలు తీస్తున్న సినిమాలను స్పూర్తిగా తీసుకుని ఇతర దర్శకనిర్మాతలు సైతం తమ సినిమాలలో కీలక మార్పులు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ సినీ అభిమానులు సైతం మలయాళ సినిమాలకు ఫ్యాన్స్ అవుతున్నారు. మలయాళ సినిమాలు సాధిస్తున్న కలెక్షన్లు సైతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ మలయాళ దర్శకులు ప్రశంసలు అందుకుంటున్నారు. మలయాళ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఒకే సమయంలో విడుదలైతే ఆ సినిమాలకు మరింత బెనిఫిట్ కలుగుతుంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.