March 23, 202507:18:42 AM

పుంజుకుంటున్న పరభాషా భామలు తృప్తి, రుక్మిణి, మమిత.!

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఎక్కువగానే ఉంది. స్టార్ హీరోల సినిమాలు వస్తుంటే.. దాదాపు అందులో ఓకే హీరోయిన్ కనిపిస్తుంది. ఏడాదికి 50 మందికి పైగా హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా ఆ లోటు మాత్రం తీరడం లేదు. పూజా హెగ్డే (Pooja Hegde) , రష్మిక (Rashmika Mandanna)..ల హవా ఇప్పుడు తగ్గింది. శ్రీలీల (Sreeleela) కూడా ఇప్పుడు డౌన్లో ఉంది. ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలో చేస్తుంది అనుకోండి. అయినప్పటికీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే కొత్త హీరోయిన్లు లేదా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు ఉండాలి. గతేడాది ఇద్దరు భామలు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించారు. వాళ్ళే ‘యానిమల్’ (Animal) బ్యూటీ అయిన తృప్తి దిమ్రి (Tripti Dimri). ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) ఫేమ్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).

‘యానిమల్’ సినిమాలో కనిపించింది కాసేపే అయినా తన నటనతో, అందంతో కట్టిపడేసింది తృప్తి దిమ్రి. ఇంటిమేట్ సీన్స్ కి కూడా ఆమె వెనుకాడలేదు. యూత్లో ఈమె మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రవితేజ (Ravi Teja) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వంటి స్టార్ హీరోల సినిమాల కోసం ఈమెను సంప్రదిస్తున్నారు. టాలీవుడ్లో ఈమె బిజీ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.

ఇక ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కోసం కూడా ‘సితార ఎంటర్టైన్మెంట్’ వంటి టాప్ బ్యానర్స్ ఎగబడుతున్నాయి. ఈమెను కూడా త్వరలోనే తెలుగు సినిమాల్లో చూసే ఛాన్స్ ఉంది.

ఇక ‘ప్రేమలు’ తో (Premalu) తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమిత బైజుపై(Mamitha Baiju) .. మరో సాయి పల్లవి (Sai Pallavi) అనే ముద్ర పడిపోయింది. ఈమె కాల్షీట్స్ కోసం కూడా టాలీవుడ్ మేకర్స్ ఎగబడుతున్నారు.

మొత్తంగా రాబోయే రోజుల్లో తృప్తి దిమ్రి, రుక్మిణీ వసంత్, మమిత బైజు..ల సందడి గట్టిగానే ఉండబోతుంది అని స్పష్టమవుతుంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.