March 24, 202509:28:10 AM

Emraan Hashmi: ఓజీ పోస్టర్ లో ఆ అక్షరాలను గమనించారా.. అర్థం ఏంటంటే?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  సుజీత్ (Sujeeth)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకు (OG Movie) సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ ఆ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi)  పోస్టర్, విడుదల కాగా వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్ లో ప్రధానంగా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇమ్రాన్ హష్మీ సిగరెట్ తాగుతూ పొగ వదలగా ఆ పొగ కూడా ఓజీ అనే అక్షరాలతో కనిపించడం గమనార్హం.

పోస్టర్ లో లైటర్ పై జపనీస్ భాషలో కొన్ని అక్షరాలు ఉండగా ఆ అక్షరాలకు క్రూరమైన హైనా అనే అర్థం వస్తుంది. ఓజీ సినిమాను సుజీత్ వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాలో ఓమీ బవూ అనే పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. ఇంటెన్స్ లుక్ తో లాంగ్ హెయిర్ తో ఇమ్రాన్ హష్మీ ఆకట్టుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఓజీ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషల్లో సైతం ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రియా రెడ్డి (Sriya Reddy) కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్, ఇమ్రాన్ హష్మీ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని సమాచారం అందుతోంది. అర్జున్ దాస్(Arjun Das), హరీష్ ఉత్తమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ కు 25 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ సినిమాకు థమన్ (S.S.Thaman) మ్యూజిక్ అందిస్తుండగా నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ మరో హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.