Jr NTR, Ram Charan: చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో ఆ డైరెక్టర్ చేసిన మార్పులివేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బుచ్చిబాబు (Buchi Babu)  కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు గతంలో ప్రచారం జరగగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాలో ఎన్టీఆర్ కు బదులుగా చరణ్ ఫిక్స్ అయ్యారు. ప్రధానంగా ఎన్టీఆర్ డేట్స్ సమస్య వల్ల కథ నచ్చినా ఈ సినిమాను వదులుకున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ వదులుకున్న తర్వాత చరణ్ కు (Ram Charan)  మారడానికి సుకుమార్ (Sukumar) కారణమని సమాచారం. సుకుమార్ సూచనల మేరకు బుచ్చిబాబు చరణ్ ను సంప్రదించడం కథ నచ్చి చరణ్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

మరోవైపు కథ విషయంలో సుకుమార్ కొన్ని సూచనలు చేశారని ఆ సూచనలకు అనుగుణంగా బుచ్చిబాబు   ఈ సినిమాలో మార్పులు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. హీరో పాత్ర, క్లైమాక్స్, స్టోరీ బ్యాక్ డ్రాప్ విషయంలో సుకుమార్ ఇచ్చిన సూచనలు బుచ్చిబాబుకు ఎంతో ఉపయోగపడ్డాయని సమాచారం అందుతోంది. సుకుమార్ ఇన్ పుట్స్ ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందిస్తున్నాయి.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. బుచ్చిబాబు ఈ సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని భోగట్టా.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.