March 15, 202512:39:29 PM

Sivaji Raja, Pawan Kalyan: ఆ సమయంలో శివాజీ రాజాతో పవన్ అలా అన్నారా.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాలలో రోజుకొక నియోజకవర్గం చొప్పున పవన్ పర్యటించనున్నారు. 10 రోజుల్లో 10 నియోజకవర్గాలు కవర్ చేసేలా పవన్ కళ్యాణ్ ప్రణాళిక ఉంటుంది. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా (Sivaji Raja) పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. నాగబాబుకు (Nagababu), నాకు మధ్య గ్యాప్ కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవే కారణమని శివాజీ రాజా అన్నారు.

ఇప్పటికీ నాగబాబు అంటే నాకు ఎంతో ఇష్టమని ఆ విషయంలో సందేహం అక్కర్లేదని ఆయన తెలిపారు. నాగబాబుకు, నాకు వ్యక్తిగతంగా ఏముంటాయని ఆయన కామెంట్లు చేశారు. గ్యాప్ కు మిస్ అండర్ స్టాండింగ్ కారణమని శివాజీ రాజా వెల్లడించడం గమనార్హం. నాగబాబును అడిగే స్టేజ్ దాటిపోయిందని శివాజీ రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ ఒకరోజు ఆఫీస్ కు వచ్చి గొడవ చేసి నెక్స్ట్ డే నిన్ను ప్రెసిడెంట్ గా ఉండనివ్వనని అన్నాడని ఆయన పేర్కొన్నారు.

మంచిదే కదా రెస్ట్ తీసుకుంటా అన్నానని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. పవన్ ఎందుకు వచ్చారో ఎందుకు గొడవ చేశారో ఇప్పటికీ క్లారిటీ లేదని శివాజీ రాజా వెల్లడించారు. పవన్ ఏదో కోపంతో రాఘవేంద్ర రావు (Raghavendra Rao) , సురేష్ బాబుకు (D. Suresh Babu) ఫోన్ చెయ్ అన్నారని ఆయన అన్నారు. పవన్ ఎమోషన్ తో వచ్చారని నాకు అన్యాయం జరిగింది తీర్పు ఎవరు చెబుతారని కామెంట్ చేశారని శివాజీ రాజా పేర్కొన్నారు.

నన్ను ఎవరో తిడితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఛాంబర్ ఏం చేస్తుందని ఆయన తెలిపారు. పవన్ ను తిట్టిన వ్యక్తులపై నేను ఐజీని కలిసి కేసు ఫైల్ చేసి పవన్ కు ఫైల్స్ ఇచ్చినా ఆయన లాయర్స్ కు ఇవ్వాలని చెప్పారని శివాజీ రాజా అన్నారు. శివాజీ రాజా వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.