Prabhas, Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ అభిమానులు అలా చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు (Ram Charan) ప్రేక్షకుల్లో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతర హీరోల అభిమానులు సైతం చరణ్ ను ఎంతో అభిమానిస్తారు. ప్రభాస్ (Prabhas) , రామ్ చరణ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాలు రాకపోయినా ఈ హీరోల మధ్య మంచి అనుబంధం మాత్రం ఉంది. అయితే చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్నిచోట్ల అన్నదాన కార్యక్రమాలు చేయడంతో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం చరణ్ పుట్టినరోజు వేడుకను పండగలా జరపడం గమనార్హం. రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ అభిమానులు చేసిన పనిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

“డార్లింగ్ అభిమానుల తరపున ప్రియమైన చరణ్ కోసం” అంటూ ఫ్యాన్స్ ఫుడ్ ప్యాకెట్లను డొనేట్ చేశారు. “మెగా పవర్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని ముద్రించిన ఫుడ్ ప్యాకెట్లు సైతం డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఈ విషయాలు తెలిసి రామ్ చరణ్ అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజున రామ్ చరణ్ అభిమానులు సైతం ఇదే విధంగా చేస్తారేమో చూడాలి.

Ram Charan With Prabhas

అభిమానులంటే కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఇవ్వడం గమనార్హం. డార్లింగ్ ఫ్యాన్స్ మనస్సు కూడా డార్లింగ్ లా మంచి మనస్సు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్, చరణ్ ప్రస్తుతం కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టి కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి (Kalki) రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్నా త్వరలో ఆ కన్యూజన్ కు చెక్ పడే ఛాన్స్ ఉంది. కల్కి సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది.

టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం చూశారా? అదగొట్టేశారు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.