Prashanthi Harathi: సునీల్‌తో నవ్వులు పూయించిన ఆ హీరోయిన్‌ రీఎంట్రీకి రెడీ!

‘పెళ్లాం ఊరెళితే’ సినిమా గుర్తుందా? శ్రీకాంత్‌(Srikanth) , వేణు (Venu Thottempudi), సునీల్‌ (Sunil) కలసి పండించిన ఆ నవ్వులు మీకు గుర్తుండే ఉంటాయి. అందులో హీరోయిన్లు కూడా మీకు గుర్తున్నారా? రక్షిత(Rakshita) , సంగీత (Sangeetha) అంటూ రెండు పేర్లు చెబుతారు. అయితే అందులో మరో హీరోయిన్‌ కూడా ఉంది. ఆమెనే ప్రశాంతి హారతి. ఆ సినిమాలో సునీల్‌ సరసన నటంచిందామె. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆ తర్వాత గ్యాప్‌ తీసుకుంది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తోంది.

‘ఇంద్ర’ (Indra) సినిమాలో ముంతాజ్‌గా కెరీర్‌ ప్రారంభించిన ప్రశాంతి హారితి.. ఆ తర్వాత ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో సునీల్‌ భార్యగా, అమాకమైన పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘ఫిబ్రవరి 14 నెక్లెస్‌ రోడ్‌’, ‘రూపాయి’ లాంటి సినిమాలతోపాటు కొన్ని సీరియళ్లలోనూ నటించారు. స్వతహాగా కూచిపూడి నృత్య కళాకారిణి అయిన ప్రశాంతి… పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే కూచిపూడి డ్యాన్స్‌ స్కూల్స్‌ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు నటిగా రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టానున్నారు.

చిన్నప్పుడు నృత్యమే తన ప్రపంచమని అలా నృత్య ప్రదర్శనలు ఇచ్చానని చెప్పిన ఆమె… ఫొటో మోడలింగ్‌ వల్ల సినిమా రంగం నుంచి అవకాశాలొచ్చాయి. అనుకోకుండా చిత్ర పరిశ్రమకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. కొన్ని సినిమాల తర్వాత పెళ్లి చేసుకున్నారు. సినీ రంగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవడం బాధగా అనిపించిందట ఆమెకు. కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని చూసుకుంటూనే ఆమెరికాలో నృత్య పాఠశాలల్ని నిర్వహించారు.

అయితే ఇప్పుడు ఆమెకు నటనపై మక్కువని గమనించిన భర్త, పిల్లలు మళ్లీ సినిమాల్లోకి వెళ్లమని అడిగారట. దీంతోనే మళ్లీ వెనక్కి వచ్చారు. ఆమె కుమార్తె తాన్య హారతితో కలిసి వి.ఎన్‌.ఆదిత్య (V. N. Aditya) దర్శకత్వంలో ‘తెలుగింటి సంస్కృతి’ పేరుతో ఓ వీడియో చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) యూట్యూబ్‌ ఛానల్‌లో ఆ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు సినిమాలకు సిద్ధమయ్యారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.