సినిమా విశ్లేషణ.. వెండితెరపై ప్రేమకథలు కొత్తేమి కాదు. ఇది కూడా అలాంటి ఓ ప్రేమ కథా చిత్రమే. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ ని చూడటం, ప్రేమలో పడటం, ఆమె వెనక తిరగడం, ఇద్దరూ కలిసి ప్రేమించుకోవడం.. ఇలా సాగుతుంది. నిషా గౌతమ్ ని వదిలేసి వెళ్లిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలా కలుసుకుంటారు అని కొంచెం ఆసక్తితో సాగుతుంది. సినిమాలో కొన్ని ట్విస్ట్ లు కూడా ఉండటం గమనార్హం. కాకపోతే ఈ ప్రేమ కథకి కాస్త మదర్ సెంటిమెంట్ తోడయింది. తల్లి ప్రేమ, ప్రియురాలి ప్రేమ.. ఎమోషన్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ప్రేమ సినిమాల్లో ఉండే డైలాగ్స్ తెలిసిందే. అలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి. సినిమా అక్కడక్కడా కాస్త బోర్ కొడుతుంది.
నటీనటుల విషయానికొస్తే.. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవాళ్లే. గౌతమ్ వర్మ ప్రేమికుడిగా వెంటపడటం, బ్రేకప్ తర్వాత బాధపడటం.. రెండు వేరియేషన్స్ లోను మెప్పించాడు. దీపశిక నటనతో పాటు అందంతోను మెప్పించింది. సత్య, జబర్దస్త్ నాగి.. పలువురు నటీనటులు పర్వాలేదనిపించారు.
మొత్తంగా రవికుల రఘురామ సినిమా ఓ ప్రేమకథగా మదర్ సెంటిమెంట్ తో సాగుతుంది. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే.