March 15, 202509:57:29 AM

Sundeep Kishan, Rao Ramesh: సందీప్ కిషన్ – రావు రమేష్..ల సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 156 వ సినిమాగా ‘బంగార్రాజు’ (Bangarraju) ఫేమ్ కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. చిరుతో పాటు ఆ ప్రాజెక్టులో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కూడా నటిస్తున్నట్టు టాక్ వచ్చింది. బెజవాడ ప్రసన్న కుమార్ (Prasanna Kumar)కథ అందించిన ఈ ప్రాజెక్టుని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) తన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ పై నిర్మించాల్సి ఉంది. ఇది ‘బ్రో డాడీ’ కి రీమేక్ అనే కామెంట్లు కూడా ఎక్కువగా వినిపించాయి.

అయితే ఊహించని విధంగా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. అయితే అదే కథని సందీప్ కిషన్ (Sundeep Kishan) , రావు రమేష్ (Rao Ramesh)..లతో చేస్తున్నట్టు ‘ఫిల్మీ ఫోకస్’ ఇది వరకే వెల్లడించడం జరిగింది. ఇది నిజమే అని నిర్మాత రాజేష్ దండా (Rajesh Danda) కన్ఫర్మ్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ “సందీప్ కిషన్, త్రినాథ్ రావు నక్కిన (Trindha Rao) , రైటర్ ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రాజెక్టు ‘బ్రో డాడీ’ కి రీమేక్ అనేది అవాస్తవం.

స్ట్రెయిట్ కథతో చేస్తున్న సినిమా ఇది. ముందు చిరంజీవి గారి దగ్గరకు వెళ్లిన కథే అయినా.. ఇప్పుడు వెర్షన్ మారింది” అంటూ చెప్పుకొచ్చారు. రాజేష్ దండా కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలే ఉన్నాయి. అగ్ర నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.