
ప్రభాస్ (Prabhas) ఈసారి పూర్తిగా వర్క్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. గతంలో ఒకేసారి రెండు సినిమాలు చేయడం కామన్ అయినా, ఇప్పుడు మాత్రం పూర్తి వ్యత్యాసంగా మూడు భారీ ప్రాజెక్టులు బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025లోనే ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలని ప్లాన్ ఉండటంతో, రెగ్యులర్‌గా షూటింగ్‌లు కంప్లీట్ చేయడం తప్పనిసరి అయ్యింది. ఫలితంగా, ఇది ప్రభాస్ కెరీర్‌లోనే నెవ్వర్ బిఫోర్ ఛాలెంజ్‌గా మారిపోయింది. ఇప్పటికే రాజాసాబ్ (The Rajasaab) షూటింగ్ చివరి దశలో ఉంది.
Prabhas
మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్-కామెడీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పూర్తిగా ప్రభాస్ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నారు. అయితే, కొన్ని కీలక సన్నివేశాలు, పాటల షూటింగ్ మిగిలి ఉండటంతో, ఇది పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ప్రాజెక్ట్. రాజాసాబ్ తర్వాత హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా షూటింగ్‌కు ప్రభాస్ ఫుల్ డేట్స్ కేటాయించనున్నాడు. 1940ల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాను పూర్తిగా రిచ్ విజువల్స్, రియలిస్టిక్ టేకింగ్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ప్రత్యేకమైన మేకోవర్‌ను ట్రై చేస్తున్నట్లు సమాచారం.
మిలిటరీ నేపథ్యంతో సాగే కథ కావడంతో, ఇందులో ప్రభాస్ హై ఇంటెన్స్ యాక్షన్ చేస్తాడని టాక్. ఈ రెండింటితో పాటు స్పిరిట్ కూడా లైన్‌లో ఉంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా 2025 జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రభాస్ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ ఎంటర్‌టైనర్ అవుతుందని ఇప్పటికే స్పష్టమైంది. వంగా సినిమాలకు హై ఓల్టేజ్ ఇంటెన్సిటీ ఉంటుందని తెలుసు. అందుకే, ఇందులో ప్రభాస్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించేలా స్క్రిప్ట్ డిజైన్ చేశారు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా, పాత్రలో ఎమోషనల్ డెప్త్, మాస్ మేనరిజమ్స్ మిక్స్ చేసి రూపొందించనున్నారు. ఈ మూడు సినిమాల కథలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉండటంతో, ప్రభాస్ నటనలో రిఫ్రెషింగ్ వేరియేషన్ చూపించాల్సి ఉంటుంది. అన్నీ పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్స్ కావడంతో, ప్రమోషన్స్, మార్కెటింగ్ లు కూడా డిఫరెంట్ రేంజ్‌లో ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి రాజాసాబ్ మొదట్లో, ఆ తర్వాత హను రాఘవపూడి సినిమా, ఆ తర్వాత స్పిరిట్ (Spirit) వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2025 ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఇయర్‌గా మారడం ఖాయం.