March 23, 202508:08:48 AM

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)  జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్'(Tillu Square). మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2022 లో వచ్చిన ‘డిజె టిల్లు’ (DJ Tillu) అనే సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ‘డిజె టిల్లు’ కి విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా..సీక్వెల్ కి మాత్రం మల్లిక్ రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ కథతోనే ఈ సినిమా కూడా రూపొందింది అని చెప్పాలి. టీజర్, ట్రైలర్స్ ఓకే అనిపించాయి.

ముందు నుండి ‘టిల్లు స్క్వేర్’ కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే ఈ సినిమాకి బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 7.80 cr
సీడెడ్ 2.70 cr
ఉత్తరాంధ్ర 3.50 cr
ఈస్ట్ 1.00 cr
వెస్ట్ 0.80 cr
గుంటూరు 0.90 cr
కృష్ణా 1.20 cr
నెల్లూరు 0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.80 cr
 ఓవర్సీస్ 3.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 23.30 cr (షేర్)

‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాపై మంచి హైప్ ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఈజీ అనే చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.