March 18, 202508:59:09 AM

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత.!

గడిచిన 3 నెలల్లో ఎంతో మంది సినీ ప్రముఖులు మృతి చెందారు. ఎస్.కె.ఎన్  (Sreenivasa Kumar Naidu) తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్‌, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్(Surya Kiran) , కోలీవుడ్ కమెడియన్ శేషు,డేనియల్ బాలాజీ (Daniel Balaji) , రచయిత శ్రీ రామకృష్ణ,సీనియర్ కమెడియన్ విశ్వేశ్వరరావు,బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత అయిన గంగూ రామ్ సే,తమిళ నటుడు అరుళ్మణి,పాప్ సింగర్ పార్క్ బొ రామ్ వంటి వారు మృతి చెందారు.

ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. కన్నడ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్నడ నిర్మాత, బిజినెస్మెన్ అయిన సౌందర్య జగదీశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మహాలక్ష్మి లే అవుట్ లో ఉండే ఆయన నివాసంలో జగదీశ్ శవమై కనిపించారు. ఆయన వయసు 55 ఏళ్ళు కావడం గమనార్హం. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం…సౌందర్య జగదీశ్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వారు తెలియజేశారు. కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్ కి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్టు కూడా పోలీసులు తెలిపారు. ఇక అంత్యక్రియల కోసం జగదీశ్ మృతదేహాన్ని ఆయన నివాసంలో ఉంచినట్టు కూడా పోలీసులు తెలియజేశారు. ఇక అతని ఆత్మకు శాంతి చేకూరాలని కొంత మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.