March 19, 202511:24:02 AM

Kanguva: ‘కంగువా’ కథ గురించి షాకింగ్ న్యూస్.!

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా ‘బింబిసార‌’ (Bimbisara)  అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫాంటసీ ఎలిమెంట్ తో కూడిన టైం ట్రావెల్ మూవీగా ‘బింబిసార’ రూపొందింది. కళ్యాణ్ రామ్ ఇందులో డబుల్ రోల్ ప్లే చేశాడు. ఒకటి పాజిటివ్ రోల్, ఇంకోటి మొదట నెగిటివ్ గా ఉండి తర్వాత పాజిటివ్ గా మారే రోల్. రెండు పాత్రల్లోనూ కళ్యాణ్ రామ్ నటన సూపర్. అయితే ఇప్పుడు ఇలాంటి కథతో ఇంకో సినిమా రాబోతుంది అని ఇన్సైడ్ టాక్.

వివరాల్లోకి వెళితే.. సూర్య (Suriya) హీరోగా ‘సిరుతై’ శివ  (Siva) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అదే `కంగువా`. (Kanguva) ఆల్రెడీ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా రిలీజ్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘కంగువా’ కథ గురించి ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే… ‘కంగువా’ కథ చాలా వరకు ‘బింబిసార‌’ కథని పోలి ఉంటుందట.

ఇందులో కూడా హీరో గ‌తం నుండి వ‌ర్త‌మానంలోకి వ‌స్తాడట. ఇందులో కూడా సూర్య పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయట. అయితే ఒకే కథతో వచ్చినా టేకింగ్ బాగుంటే ఏ సినిమాని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘టెంపర్’ ‘పటాస్’ కథలు ఒక్కటే…అయినా టేకింగ్ పరంగా అవి డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే రెండూ సక్సెస్ అయ్యాయి. ఇక ‘కంగువా’ లో దిశాప‌టానీ (Disha Patani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన‌వేల్, వంశీ ప్ర‌మోద్ ..లు నిర్మాతలు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.