రెబల్‌స్టార్‌ ఫ్యామిలీ నుండి మరో హీరో! దర్శకుడు కూడా స్టార్‌..!

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) శిష్యుడు గణేశ్‌ మాస్టర్‌ దర్శకుడిగా మారారు. ఆయన మెగాఫోన్‌ పట్టబోతున్నారు అంటూ రెండు రోజులుగా వార్తలు, పోస్టర్‌లు, లీకులు వస్తున్నాయి. అయితే అందులో ఎక్కడా హీరో ఎవరు అనే విషయాన్ని చెప్పలేదు. ఈ రోజు ఉదయం కూడా హీరో ఎవరు అనే సర్‌ప్రైజ్‌ ముహూర్తం సమయానికి రివీల్‌ చేస్తామని ప్రకటించారు. అన్నట్లుగా ప్రకటించిన విషయం సర్‌ప్రైజ్‌గానే ఉంది. ఎదుందుకంటే హీరో ప్రభాస్‌కు చుట్టం.

గణేశ్ మాస్టర్ దర్శకత్వం వహించబోతున్న ఆ సినిమాకు ‘గౌడ్‌ సాబ్‌’ అనే పేరు పెట్టారు. వింటుంటే ‘రాజా సాబ్‌’ (Rajasaab) వైబ్స్‌ వస్తున్నాయి కదా. ఆయన కుటుంబం నుండి వస్తున్న హీరో కాబట్టి ఆ వైబ్స్‌ కోసం ఇలా పేరు పెట్టి ఉండొచ్చు అనే చర్చ ముహూర్తం కార్యక్రమం సమయంలో అక్కడ వినిపించింది కూడా. అయితే పాత్ర పేరు, కథకు తగ్గట్టుగా అలా టైటిల్‌ పెట్టారు అని టీమ్‌ చెబుతోంది. అన్నట్లు హీరో పేరు చెప్పలేదు కదా విరాట్‌ రాజ్‌.

చెప్పాలంటే… విరాట్ రాజ్ లుక్స్ బాగున్నాయి. ప్ర‌భాస్‌లా ఎత్తుగా ఉన్నాడు. రంగు బాలీవుడ్‌ హీరోలకు మించి అని చెప్పొచ్చు. ఆ కటౌట్‌ చూసినవాళ్లు మాస్, యాక్ష‌న్ సినిమాల‌కు బాగా సెట్ అవుతాడు అంటున్నారు. ‘గౌడ్ సాబ్’ కూడా మాస్‌ – యాక్షన మేళవించి రాసుకున్నారు అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) క్లాప్ కొట్టి టీమ్‌ని విష్‌ చేశారు. అయితే మరికొంతమంది స్టార్‌ దర్శకులు వస్తారని చెప్పినా వాళ్లు ముహూర్తంలో కనిపించకపోవడం గమనార్హం.

గణేశ్ మాస్టర్‌ విషయం తీసుకుంటే… హీరో ఇంట్రక్షన్‌ సాంగ్స్‌కు, ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ పాటలకు ఆయన అందించే స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మాస్‌ పాటలకు చిందేయించడంలో ఆయన స్టైల్‌ బాగుంటుంది. మరిప్పుడు సినిమాను ఎలా హ్యాండిల్‌ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. రెబల్‌ స్టార్‌ కష్ణంరాజు ఫ్యామిలీకి దూరపు చుట్టుం అయిన విరాట్‌ రాజ్‌ ఎలా రాణిస్తాడో కూడా చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.