March 22, 202505:26:45 AM

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ అప్‌డేట్‌ చెప్పిన హీరో… ఎప్పుడు రావొచ్చంటే?

విజయ్‌ ఆంటోని (Vijay Antony) … మనకు కొత్త పేరేం కాదు. ‘సలీమ్‌ డాక్టర్‌’ సినిమాతో నటుడిగా మనకు సుపరిచితం అయిన ఆయన అంతకుముందే ‘మహాత్మ’ సినిమాకు సంగీతం అందించారు కూడా. అయితే విజయ్‌ ఆంటోని అనగానే మనకు గుర్తొచ్చే సినిమా పేరు ‘బిచ్చగాడు’. ఈ సినిమాలో ఆయన సౌత్‌లో స్టార్‌ అయిపోయారు. ఆ తర్వాత ఆయన నటిస్తున్న సినిమాలు చాలావరకు తెలుగులో విడుదలవుతూ వచ్చాయి. తాజాగా ఆయన ఓ డిఫెంట్‌ కాన్సెప్ట్‌తో చేసిన ‘లవ్‌ గురు’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో విజయ్‌ ఆంటోని హైదరాబాద్‌లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘బిచ్చగాడు 3’ గురించి కూడా మాట్లాడాడు. విజయ్‌ ఆంటోని రొమాంటిక్‌ జానర్‌లో ‘లవ్‌ గురు’ అనే సినిమా చేశాడు. ఆ సినిమాను ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు విజయ్‌ ఆంటోని. మరి ‘బిచ్చగాడు 3’ సంగతేంటి అని అడిగితే… ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని, 2026 వేసవిలో సినిమాను తీసుకొస్తామని చెప్పారు.

వ్యక్తిగతంగా తానెప్పుడూ ఫ్యూచర్‌ గురించి ఆలోచించనని, ఎప్పుడూ ప్రజెంట్‌లోనే ఉంటానని చెప్పిన విజయ్‌ ఆంటోని… ఒకటి కోరుకున్నప్పుడు ఇంకొకటి దక్కితే నిరాశ పడాల్సి వస్తుందని చెప్పాడు. ఈ సినిమా విషయంలో అదే జరిగిందని తెలిపాడు. దర్శకుడు తన జీవితంలో చూసిన అనుభవాలతో ఈ సినిమాను రూపొందించారట. అలాగే ఈ సినిమాలో ఫ్యామిలీ కామెడీ ఉంటుంది చూస్తారని భరోసా ఇచ్చాడు.

తెలుగులో సినిమాలు చేయొచ్చుగా అని అడిగితే… తనకు మెమొరీ పవర్‌ తక్కువని, అందుకే తెలుగు నేర్చుకోలేకపోయానని చెప్పాడు. తనకు తెలుగు వచ్చి ఉంటే నేరుగా తెలుగులోనే సినిమాలు చేసేవాణ్ని అని చెప్పాడు. అలాంటి అవకాశమే ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేసేవాడినని చెప్పాడు విజయ్‌ ఆంటోని. దీంతో ఆయనకు తెలుగు వచ్చి ఉన్నా బాగుండు… వైవిధ్యమైన ఆయన సినిమాలు తెలుగులో ముందే చూసేవాళ్లం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.