Kona Venkat: అదుర్స్2 పాన్ వరల్డ్ మూవీ.. కోన కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindhi)  మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొన్నిరోజుల క్రితం కోన వెంకట్ (Kona Venkat) జూనియర్ ఎన్టీఆర్ తో (Jr NTR) అదుర్స్ (Adhurs) సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసుకుంటానని ఆయన చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో అదుర్స్2 గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. అదుర్స్2 మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తైందని జూనియర్ ఎన్టీఆర్ కు ఒకసారి చెప్పేస్తే కథ విన్న తర్వాత ఫైనల్ టచెస్ తప్ప మొత్తం అయిపోయిందని కోన తెలిపారు.

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ తర్వాత ఆ సినిమా విషయంలో నేను రీవర్క్ చేయడం జరిగిందని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. అదుర్స్2 లో ఎన్టీఆర్ గెటప్ అదే విధంగా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. ఇతర దేశాలలో సైతం తారక్ సినిమాలు చూస్తున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. అదుర్స్2 పాన్ వరల్డ్ మూవీ అని ఆయన వెల్లడించారు. అదుర్స్2 లో మిషన్ పెద్దదని వాళ్ల గోల్ పెద్దదని కోన పేర్కొన్నారు. సేమ్ టీమ్ తో అదుర్స్2 ప్లాన్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రమే చేయాలని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఈ కథ, పాత్ర పుట్టింది ఎన్టీఆర్ కోసమే అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ చేయకపోతే ఎన్టీఆర్ కొడుకుతో అదుర్స్2 చేస్తానని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో రాజీ పడే అవకాశం అయితే లేదని ఆయన వెల్లడించారు. తన బ్యానర్ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నామని ఆయన అన్నారు.

సినిమాల్లో ఉండేవాళ్లు రాజకీయాల్లోకి వెళ్లకూడదని ఛాంబర్ లో రూల్ తెస్తే బాగుంటుందని కోన వెంకట్ అన్నారు. ఇది నా అభిప్రాయం మాత్రమేనని ఆయన వెల్లడించారు. అదుర్స్2 విషయంలో కోన వెంకట్ కామెంట్లు నిజమవుతాయో చూడాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.