March 15, 202511:59:22 AM

Prabhas: ‘కన్నప్ప’ నుండి ప్రభాస్ తప్పుకున్నాడా? మేటర్ ఏంటి?

మంచు విష్ణు (Manchu Vishnu)  ప్రధాన పాత్రలో ‘క‌న్న‌ప్ప‌’ (Kannappa) అనే సోషియో ఫాంటసీ మూవీ రూపొందుతుంది. మంచు విష్ణు కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు. అందుకే చాలా మంది స్టార్స్ ని రంగంలోకి దింపాడు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తో (Shiva Rajkumar) పాటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్, (Prabhas) లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)  వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటనలు వచ్చాయి.

ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగేది అంటూ ఉంటే అది ప్ర‌భాస్ వల్లే అనడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా నుండి ప్రభాస్ తప్పుకున్నాడు అంటూ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అందుకు కారణం..’కన్నప్ప’ లో శివుడి పాత్రకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని  (Akshay Kumar)  తీసుకున్నారట. ముందు నుండీ ఆ పాత్ర ప్రభాస్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అక్షయ్ పేరు వినిపిస్తుండటంతో ప్రభాస్ తప్పుకున్నాడు అంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి.

కానీ వాటిలో నిజం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం… ఇందులో ప్రభాస్ నందీశ్వ‌రుడిగా కనిపించబోతున్నాడు. అవును వాస్తవానికి ప్రభాస్ కి శివుడి పాత్రే చేయమని విష్ణు కోరాడట. కానీ ప్రభాస్ అందుకు నో చెప్పాడని తెలుస్తోంది. తర్వాత నందీశ్వరుడు పాత్ర గురించి దర్శకుడు చెప్పగా ప్రభాస్ వెంటనే ఓకే చెప్పినట్టు టాక్.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.