March 20, 202508:52:38 PM

Kona Venkat: జనాలు వస్తే చాలు లెండి.. నెటిజన్..కి కోన వెంకట్ సెటైర్!

ఏ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినా..వాటి పై సోషల్ మీడియాలో డిస్కషన్లు జరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ చర్చలపై అప్పుడప్పుడు ఆయా.. సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉంటారు. అలా ఇవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.2014 లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

10 ఏళ్ళ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది.’కోన ఫిల్మ్స్ కార్పొరేషన్’, ‘ఎం.వి.వి.సినిమాస్’ బ్యానర్స్‌పై కోన వెంకట్ (Kona Venkat) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి (Anjali) కెరీర్లో ఇది 50వ సినిమా ఇది. హారర్ కామెడీ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా రూపొందింది.ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. 2:28 నిమిషాల నిడివి కలిగిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది.

ట్రైలర్ ఎలా ఉంది అనే సంగతి పక్కన పెడితే.. ఓ నెటిజెన్ ఈ ట్రైలర్ పై స్పందిస్తూ.. “నవ్వు రాలేదు.. భయమూ వేయలేదు.. ” అంటూ సెటైరికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి ఆ సినిమా నిర్మాత కమ్ రైటర్ అయిన కోన వెంకట్ స్పందించాడు. ‘జనాలు వస్తే చాలు లెండి’ అంటూ తన స్టైల్లో ఓ సెటైర్ విసిరాడు. క్రిటిక్స్ కి నచ్చినా.. నచ్చకపోయినా జనాలు థియేటర్ కి వస్తారనేది అతని నమ్మకం అయ్యుండొచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.