March 19, 202501:12:25 PM

Priyanka Jain: హాట్ టాపిక్ గా మారిన ప్రియాంక జైన్ పెళ్లి వీడియో!

టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) , నితిన్ (Nithiin) ‘ఎక్స్ట్రా’ (Extra: Ordinary Man) సినిమాలో విలన్ గా చేసిన సుదేవ్ నాయర్ (Sudhev Nair) ,స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), సీనియర్ హీరోయిన్ అక్ష (Aksha Pardasany), బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan), మీరా చోప్రా (Meera Chopra) .. సింగర్ హారికా నారాయణ్ (Harika Narayan) ,జబర్దస్త్ కమెడియన్ మోహన్ వంటి వారు పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు మరో హీరోయిన్ కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా పెళ్లిపీటలెక్కినట్టు చర్చలు జరుగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. జానకి కలగనలేదు’, ‘మౌనరాగం’ వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియాంక జైన్ (Priyanka Jain) అందరికీ గుర్తుండే ఉంటుంది.ముఖ్యంగా ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ 7లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది అని చెప్పాలి. ‘బిగ్ బాస్ 7 ‘ లో తన గేమ్ తో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుని టాప్ 5లో నిలిచింది. ఇక తాజాగా ఈమె సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు అంతా అనుకుంటున్నారు.

తన ప్రియుడు అలాగే ప్రముఖ సీరియల్ నటుడు అయిన శివకుమార్ తో ప్రియాంక పెళ్లి ఘనంగా జరిగింది అనే వార్త ఇప్పుడు ఊపందుకుంది. అందుకు కారణం వీరి పెళ్లి జరిగింది అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండటం వల్లనే అని చెప్పాలి. అయితే ఇది ఒరిజినల్ పెళ్లి కాదు. ఓ టీవీ షోలో భాగంగా వీరికి ఫేక్ పెళ్లి చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలే ఈ డిస్కషన్స్ కి కారణమయ్యాయి అని చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.