March 20, 202506:20:53 PM

Nag Ashwin: ‘కల్కి’ ఆ హాలీవుడ్‌ సినిమాకు కాపీనా? దర్శకుడు ఏమన్నారంటే?

‘కల్కి 2898 ఏడీ’ (Kalki-2898 AD) (అప్పట్లో ‘ప్రాజెక్ట్‌ కె’ అనుకోండి) సినిమా ప్రారంభమైంది మొదలు.. ఇదేదో ఇంగ్లిష్‌ సినిమాకు కాపీ అని, రీమేక్‌ అని, ఫ్రీమేక్‌ అని చాలా రకాలుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) అండ్‌ టీమ్‌ మాత్రం ఈ మాటల్ని వరుసగా కొట్టేస్తూ ఉంది. అయినప్పటికీ ఈ మాటలు ఆగడం లేదు. తాజాగా సినిమా నుండి అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) పాత్రకు సంబంధించిన టీజర్‌ వీడియో వచ్చాక మళ్లీ కాపీ మరకలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ మరోసారి క్లారిటీ వచ్చింది.

అగ్ర హీరల సినిమాలు సెట్స్‌పై ఉండగానే కథకు సంబంధించి, సినిమా చిత్రణకు సంబంధించి అనేక ఊహాగానాలు, వార్తలు వస్తుంటాయి. సోషల్‌ మీడియాలో అయితే రోజుకొకటి వినిపిస్తూ ఉంటుంది. పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌ చూసి ఈ మాటలు చెబుతుంటారు. అయితే చాలావరకు ఇలాంటి వార్తల్లో నిజం ఉంటూ ఉండటంతో ఈ మధ్య కాలంలో ఇలాంటి పుకార్లకు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే ‘కల్కి’ గురించి కూడా తెగ మాట్లాడుతున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను హాలీవుడ్‌ సినిమా ‘డ్యూన్‌’ నుండి కాపీ కొట్టారంటూ మరోసారి వార్తలు, పుకార్లు వచ్చాయి.

తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దగ్గర ప్రస్తావిస్తే ఒక్కసారిగా నవ్వేసి రిప్లై ఇచ్చారు. మూవీ గోయెర్స్‌ అనే ఈవెంట్‌లో నాగ్‌ అశ్విన్‌ పాల్గొనగా.. అక్కడే ఈ టాపిక్‌ వచ్చింది. ‘కల్కి’ని హాలీవుడ్‌ చిత్రం ‘డ్యూన్‌’తో పోలుస్తున్నారు కదా.. మరి మీ అభిప్రాయం ఏంటి’ అని అడిగితే ‘బహుశా టీజర్‌లో ఉన్న ఇసుకను చూసి అలా అనుకొని ఉండొచ్చు’’ అని అన్నారు నాగ్‌ అశ్విన్‌.

ఇసుకను ఏ సినిమా స్క్రీన్‌ మీద చూసినా, ట్రైలర్‌లో చూసినా ‘డ్యూన్‌’ సినిమాలాగే ఉంటుంది. అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకొచ్చింది. అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.