March 22, 202504:14:02 AM

Tamannaah: ఆ సినిమా చూశాక ఇకెప్పుడూ ఆ పని చేయలేదు.. తమన్నా ఏం చెప్పిందంటే?

సినిమాలో కొన్ని సీన్స్‌ చూసి మళ్లీ అలాంటి పని చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. మనమే కాదు సినిమాల్లో నటించిన వాళ్లు కూడా అలానే అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్‌ ఉంటే తమన్నా చెప్పిన మాటలు ఒకసారి చదవండి మీకూ అర్థమైపోతుంది. కొత్త సినిమా ‘బాక్‌’ ప్రచారం కోసం వచ్చిన తమన్నా (Tamannaah) సినిమా గురించి చెబుతూ, తన గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలు అందుకుంటున్న కథానాయిక ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని ఓ లిస్ట్‌ రాస్తే.. అందులో తమన్నా పేరు కచ్చితంగా ఉంటుంది. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు ‘బాక్‌’ సినిమాతో థ్రిల్‌ చేయడానికి సిద్ధంగా ఉంది. హారర్‌ కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా మే 3న విడుదల అవుతోంది. ఈ క్రమంతో తన బ్యూటీ టిప్స్‌ గురించి ప్రస్తావన వస్తే.. ఓ హాలీవుడ్‌ సినిమాను చూసినప్పటి నుండి వ్యాక్సింగ్‌ చేయించుకోవడం మానేశానని చెప్పింది.

‘హౌజ్‌ ఆఫ్‌ వ్యాక్స్‌’ అనే సినిమాలో వ్యాక్స్‌తో వివిధ రకాలుగా మహిళలను చంపేస్తుంటారు. ఆ సినిమా చూశాక తమన్నా వ్యాక్సింగ్‌ చేయడం మానేసిందట. ఆమె చెప్పినట్లే ఆ సినిమాలో ఆ మర్డర్‌ సీన్లు, వ్యాక్సింగ్‌ భయం పుట్టిస్తాయి. ఇక తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల 2’ సినిమాతో బిజీగా ఉంది. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ (Odela Railway Station) సినిమాకు ఇది సీక్వెల్‌. దర్శకుడు సంపత్‌ నంది (Sampath Nandi) పర్యవేక్షణలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది.

ఇక మిల్కీ బ్యూటీ హిందీలో ‘వేదా’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌లను ఓకే చేసే పనిలో ఉంది. త్వరలో ఆ ప్రాజెక్టుల గురించి క్లారిటీ రావొచ్చు. మరోవైపు విజయ్‌ వర్మతో (Vijay Varma) ఆమె ప్రేమ కథ కూడా కొనసాగుతోంది. మరి ఇదెటు దారి తీస్తుందో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.