March 22, 202506:42:44 AM

Prashanth Varma: ఆ మాట కంటే గొప్పది ఏముంది.. ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్!

హనుమాన్ (Hanu Man) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తేజ సజ్జా (Teja Sajja) పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగింది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మకు (Prasanth Varma) మూవీ ఆఫర్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. అయితే చిరంజీవి (Chiranjeevi) తాజాగా హనుమాన్ మూవీ గురించి, తేజ సజ్జా యాక్టింగ్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్ల గురించి ప్రశాంత్ వర్మ రియాక్ట్ అయ్యారు. తాను కూడా హనుమాన్ లాంటి సినిమా చేయాలని అనుకోగా తేజ సజ్జా చేశాడని చిరంజీవి తెలిపారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ చిరంజీవి గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ హనుమాన్ అని చెప్పడం కంటే గొప్ప ఏముంటుందని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి గారి మాటలు నాలో బరువు బాధ్యతలను మరింత పెంచాయని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. కచ్చితంగా ఈ మాటలను నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో చూస్తున్న సమయంలో కన్నీళ్లను ఆపుకోలేకపోయానని ప్రశాంత్ వర్మ తెలిపారు.

అక్కడ తేజ ఎలాంటి ఫీల్ అనుభవిస్తున్నాడో నాకు మాత్రమే అర్థమవుతుందని ఆయన కామెంట్లు చేశారు. ప్రశాంత్ వర్మ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రశాంత్ వర్మ చేసిన ఈ పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ తర్వాత మూవీ జై హనుమాన్ టైటిల్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జై హనుమాన్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. జై హనుమాన్ సినిమాలో చిరంజీవి భాగం అయితే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు. ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరినట్టేనని ఆయనకు కెరీర్ పరంగా తిరుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.