Naa Saami Ranga Collections: ‘నా సామి రంగ’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకుడిగా మారుతూ చేసిన మూవీ ‘నా సామి రంగ’ (Naa Saami Ranga). అల్లరి నరేష్ (Allari Naresh) , రాజ్ తరుణ్ (Raj Tarun) వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ మూవీ పై పడింది. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి (Srinivasaa Chitturi)  ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ..ల కి సూపర్ రెస్పాన్స్ లభించాయి.

దీంతో అంచనాలు కూడా బాగా పెరిగాయి. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ లభించింది. దీంతో కలెక్షన్స్ బాగా వచ్చాయి. ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  4.98 cr
సీడెడ్  3.76 cr
ఉత్తరాంధ్ర  3.62 cr
ఈస్ట్  2.77 cr
వెస్ట్  1.40 cr
గుంటూరు  1.52 cr
కృష్ణా  1.30 cr
నెల్లూరు  0.88 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  20.23 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.79 cr
ఓవర్సీస్  0.65 cr
వరల్డ్ వైడ్( టోటల్)  21.67 cr (షేర్)

‘నా సామి రంగ’ సినిమాకు రూ.19.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.19.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.21.67 కోట్ల షేర్ ను రాబట్టింది.మొత్తంగా రూ.2.27 కోట్ల లాభాలను అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.