Priyadarshi, Prabhas: ఆ టైటిల్ తో సినిమా తీస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి పేరు ఉన్న ప్రియదర్శి (Priyadarshi Pulikonda)  వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే నభా నటేష్ (Nabha Natesh) , రీతూ వర్మలను (Ritu Varma) డార్లింగ్ అంటూ ప్రియదర్శి కామెంట్ చేయడం వెనుక అసలు ప్లాన్ వేరే ఉందని తెలుస్తోంది. ప్రియదర్శి హీరోగా డార్లింగ్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతోందని ఈ సినిమాపై హైప్ పెంచాలనే ఆలోచనతో ఈ విధంగా ప్లాన్ చేశారని భోగట్టా. అయితే ప్రభాస్ ను (Prabhas) అభిమానులు ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ కరుణాకరన్ (A. Karunakaran) కాంబినేషన్ లో తెరకెక్కిన డార్లింగ్ (Darling) సినిమా 2010 సంవత్సరంలో విడుదలై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చింది ఈ సినిమా ఇంటర్వల్ ట్విస్ట్ ప్రేక్షకులను అప్పట్లో ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. డార్లింగ్ తర్వాత ఇదే తరహా ట్విస్ట్ తో చాలా సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు ఆకట్టుకోలేదు. ప్రభాస్ అభిమానులు డార్లింగ్ అనే టైటిల్ తో మరో సినిమా తెరకెక్కితే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అయితే ప్రియదర్శి మూవీ టైటిల్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. డార్లింగ్ అనే పదానికి కొద్దిగా మార్పు చేసి టైటిల్ ను ఫిక్స్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ప్రియదర్శి సోలో హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. నభా నటేష్ , రీతూ వర్మ ఈ సినిమాలో నటిస్తారేమో చూడాల్సి ఉంది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న నభా నటేష్ రీఎంట్రీలో వరుస సినిమాలతో బిజీ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

ప్రియదర్శి కామెడీ టైమింగ్ తో తన రేంజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు. ప్రియదర్శి ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) తో కొన్నిరోజుల క్రితం హిట్ అందుకున్నారు. కొత్త తరహా కథలను ఎంచుకుంటే ప్రియదర్శికి తిరుగుండదని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రియదర్శికి కెరీర్ పరంగా మరింత కలిసొస్తుందేమో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.