Rajinikanth: రజనీ కొత్త సినిమా పేరు ఖరారు… తొలి పార్టులో ఉన్నదే!

‘హుకుం జైలర్‌ కా హుకుం’… ‘జైలర్‌’ (Jailer) సినిమాలో ఈ మాట, ఈ పాట ఎంతటి సందడి చేశాయో మనందరికి తెలిసిందే. రజనీకాంత్‌ (Rajinikanth) యాటిట్యూడ్‌, డైలాగ్‌ డెలివరీకి ఫ్యాన్స్‌ అయినవాళ్లు అయితే ఆ పాటను, మాటలను భలే ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అంటే.. ఆ హుక్‌ లైనే ఇప్పుడు సినిమా పేరుగా మారబోతోందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ‘జైలర్‌’ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సినిమా పేరు కూడా బయటకు వచ్చింది.

దర్శకుడు నెల్సన్‌ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ‘జైలర్‌’ సినిమాతో రజనీ కెరీర్‌లో అత్యంత భారీ వసూళ్ల చిత్రాన్ని అందించాడు. ఈ సినిమాకు సుమారు రూ., 600 కోట్ల వసూళ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత ఇతర హీరోలతో సినిమా ఉండొచ్చు అని వార్తలొచ్చినా ఇంకా ఆయన ఏదీ ఓకే చేయలేదు. అయితే ఆయన ఆగింది రజనీకాంత్ కోసమే అని టాక్‌. ‘జైలర్‌ 2’ కోసం ఆయన స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభించేశారట. అంతేకాదు సగం పని అయింది అని కూడా అంటున్నారు.

ఈ సినిమాకు ‘హుకుం’ అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తాజాగా చెబుతున్నారు. ఇటీవల రజనీకి స్క్రిప్ట్‌ కూడా వినిపించగా, ఆయన ఓకే చేశారట. అయితే ఈ సినిమా సీక్వెలా? లేక ప్రీక్వెలా? అనేది తెలియడం లేదు. ‘హుకుం’ అని పేరు పెట్టారు అంటే రజనీ పోలీసు పాత్ర చుట్టూ ఈ సినిమా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అదే జరిగితే సినిమా ప్రీక్వెలే అవుతుంది.

ఎందుకంటే సీక్వెల్‌లో మళ్లీ యంగ్‌గా చూపించి ‘హుకుం’ అనిపించే అవకాశం లేదు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ ఇస్తారట. ప్రస్తుతం రజనీ ‘వేట్టయాన్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్‌ (Lokesh Kangaraj) సినిమా చేస్తారు. ఈ సినిమా వివరాలు 17వ తేదీన తెలుస్తాయి. ఆ సినిమా తర్వాతే ‘హుకుం’ సినిమా ఉండొచ్చు అని టాక్‌.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.