March 22, 202504:31:13 AM

Tillu Square: టిల్లు స్క్వేర్ మూవీ ఆ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమేనా?

టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఐదు రోజుల్లోనే ఈ సినిమాకు ఏకంగా 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. వీక్ డేస్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తూ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. మల్లిక్ రామ్ (Mallik Ram) ఈ సినిమాకు దర్శకత్వం వహించారనే సంగతి తెలిసిందే. ఫస్ట్ వీక్ కలెక్షన్లతో ఈ సినిమా 100 కోట్ల రూపాయల మార్కును దాటే అవకాశం అయితే ఉంది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ఇప్పటికే పరీక్షలు రాసిన యూత్ ఈ సినిమాపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  , నాని (Nani) ఖాతాలలో ఉన్న రికార్డ్స్ ను సైతం ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతను ఆకట్టుకునే సినిమా కావడం ఈ సినిమాకు మేలు చేస్తోంది.

దసరా ఫుల్ రన్ లో ఏకంగా 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా గీతా గోవిందం (Geetha Govindam) సినిమాకు ఫుల్ రన్ లో 130 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ కలెక్షన్ల రికార్డులను టిల్లూ స్క్వేర్ బ్రేక్ చేస్తుందా? లేదా? అనే చర్చ నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. నాని, విజయ్ దేవరకొండ క్రేజ్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారు.

Hero nani Vijay Devarakonda

సిద్ధు (Siddhu Jonnalagadda) జొన్నలగడ్డ  వరుస విజయాలు సాధిస్తే మాత్రం మిడిల్ రేంజ్ హీరోలలో నంబర్1 గా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయి. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి సినిమా సక్సెస్ సాధించేలా సిద్ధు అడుగులు పడుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సిద్ధు రెమ్యునరేషన్ పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.