10 ఏళ్ల క్రితం పోయింది… మళ్లీ ఇన్నాళ్లకు దొరికింది… ప్రగ్యా భలే లక్‌!

ప్రగ్యా జైస్వాల్‌  … ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయింది. ఆమె తొలి సౌత్‌ సినిమా ఏది అంటే అందరూ ‘కంచె’ (Kanche) అనుకుంటారు కానీ.. అప్పటికే కొన్ని సినిమాలు చేసింది. ఆ విషయం పక్కనపెడితే.. కెరీర్‌ ప్రారంభమైన తొలి నాళ్లలోనే ప్రగ్యా (Pragya Jaiswal) ఓ బాలీవుడ్‌ సినిమాలో నటించాల్సింది. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా తప్పిపోయింది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చర్చకు వచ్చింది అంటే… అలా తప్పి పోయిన సినిమా ఛాన్స్‌ ఇప్పుడు మళ్లీ దక్కింది కాబట్టి. అదే అదే సినిమా అని కాదని, ఆ హీరోతోనే అని మా ఉద్దేశం.

ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన పిక్చర్‌లోనే నటిచే అవకాశం సంపాదించా. ఇది నా అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేసింది ప్రగ్యా జైస్వాల్‌ . బాలయ్యతో (Nandamuri Balakrishna) చేసింది ఒక్క సినిమానే అయినా బాలకృష్ణ నాయికగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న ప్రగ్యా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘ఖేల్‌ ఖేల్‌ మే’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం చెప్పింది.

2014లో అక్షయ్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రలో క్రిష్‌ తెరకెక్కించిన ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ సినిమా కోసం ప్రగ్యా జైస్వాల్ ఆడిషన్‌ ఇచ్చిందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం దక్కలేదు. ఇప్పుడు అంటే పదేళ్ల తర్వాత అక్షయ్‌ సినిమాలోనే కీలక పాత్ర పోషిస్తున్నా అంటూ ఆనందపడిపోతోంది ప్రగ్యా. అక్షయ్‌తో సినిమా అనగానే భయపడ్డానని, కానీ ఆయన ఎంతగానో ప్రోత్సహించారని సగటు హీరోయిన్‌ కామెంట్స్‌ కూడా చేసింది.

తెలుగులో ‘సన్నాఫ్‌ ఇండియా’ (Son of India) సినిమాతో ఆఖరిగా పలకరించిన ఈ అందం… ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది అనే వార్తలు వచ్చాయి. అయితే దీని మీద టీమ్‌ నుండి ఎలాంటి కామెంట్‌ లేదు. ఆ సినిమాలో ఆమెది విలన్‌ పాత్ర అని కూడా అంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.