March 22, 202508:33:27 AM

Balakrishna, Mokshagna: మోక్షజ్ఞ వాళ్లనే స్ఫూర్తిగా తీసుకోవాలి… బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్‌!

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమా ఎప్పుడు అంటూ ఫ్యాన్స్‌ గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇదిగో, అదిగో అంటూ అప్పుడప్పుడు బాలకృష్ణ (Balakrishna)  చెబుతున్నా.. ఎక్కడా అఫీషియల్‌గా సినిమా ప్రకటన జరగలేదు. అయితే ప్రతిసారి బాలయ్య బయటకు వచ్చినప్పుడు ఈ విషయం గురించి చర్చ వస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అదే జరిగింది. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari)  సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చిన బాలయ్య మోక్షు గురించి మాట్లాడాడు.

‘‘మా అబ్బాయి మోక్షు పరిశ్రమకి రావాలి. తను విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) , అడివి శేష్ (Adivi Sesh) , సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లాంటి యంగ్‌ హీరోలను స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని బాలయ్య అన్నాడు. దీంతో ఆయన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అలాగే తపన ఉన్న నిర్మాత వంశీ అని చెప్పిన బాలయ్య… ఆయనతో మరో మంచి కలయిక ఉందని, త్వరలోనే ప్రకటిస్తామని చెప్పాడు. అంటే మోక్షజ్ఞ సినిమా త్వరలోనే సితార బ్యానర్‌లోనే అంటున్నారు. మోక్షజ్ఞ కొన్ని నెలల క్రితం మాస్‌ హీరోకు తగ్గ బాడీతో కనిపించలేదు. అయితే ఇప్పుడు ఫిజిక్‌పై కఠినంగా శ్రమించి హీరోలా మారాడు.

ఈ మధ్య ఫొటోల్లో కనిపించి మెరిపించాడు కూడా. తాను ఇన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ సినిమాలోని డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతానని ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలనేదే తన ఆలోచన అని బాలయ్య చెప్పాడు. ఈ గొప్ప విషయం తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుండి నేర్చుకున్నానని, కొత్తదనం ఇస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని బాలయ్య చెప్పుకొచ్చారు. తనలాగే తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని చెప్పిన ఆయన..

ఎప్పుడు వస్తాడు, ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది మాత్రం చెప్పలేదు. గతంలో అయితే తన తనయుడి సినిమాకు తనే దర్శకత్వం వహిస్తానని బాలయ్య అన్నట్లు గుర్తు. మరిప్పుడు ఆలోచన ఏమైనా మారిందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కొంతమంది దర్శకుల పేర్లు ఈ ప్రాజెక్ట్‌ విషయంలో వినిపించినా ఏవీ ఫైనల్‌ కాలేదు. బాబీ  (Bobby) సినిమా అయిపోయాక బాలయ్య ‘అఖండ 2’ (Akhanda2) చేస్తారని టాక్‌. పారలల్‌ తనయుడి సినిమా పనులు కూడా ఉంటాయట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.