March 22, 202505:26:44 AM

Balakrishna: ఎన్నికల ఫలితాలు.. సక్సెస్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న బాలయ్య

బాలయ్యకి (Nandamuri Balakrishna) సెంటిమెంట్లు వంటివి ఎక్కువ. జ్యోత్హిష్యాలు వంటివి కూడా బాగా నమ్ముతాడు. ఉదయం ఇంటి నుండి బయటకు వచ్చే ముందు పూజ చేసుకుని బయటకు రావడం.. అలాగే సాయంత్రం ఇంటికి వెళ్ళాక పూజలు చేసుకోవడం బాలయ్యకి అలవాటు. బాలయ్యకి ఓ సక్సెస్ దక్కితే.. అది ఏ రోజున వచ్చింది? ఏ టైం కి వచ్చింది? ఇలాంటి లెక్కలు అన్నీ వేసుకుని చెక్ చేసుకుంటాడు. ఇక విషయానికి వెళ్ళిపోదాం. జూన్ 4న ఎన్నికలకు ఫలితాలు విడుదల కాబోతున్నాయి.

2024 ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలతో పాటు తెలంగాణా ప్రజలు కూడా ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాల విషయంలో కూడా బాలయ్యకి ఓ సెంటిమెంట్ ఉంది.2014 లో బాలయ్య పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైంలో తొలిసారి హిందూపురం నియోజకవర్గం నుండీ శాసనసభ్యుడిగా పోటీ చేశాడు. అప్పుడు కౌంటింగ్‌ టైంలో ఆర్డీటీ స్టేడియంలో బాలయ్య బస చేశాడట. ఆ స్టేడియంలోని 9వ నెంబర్‌ గదిలో బాలయ్య స్టే చేయడం జరిగింది…!

2019 ఎన్నికల ఫలితాల రోజున కూడా బాలయ్య ఇదే సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడట. అప్పుడు కూడా ఆయన గెలిచాడు. ఇక 2024 ఎన్నికల ఫలితాల రోజున కూడా బాలయ్య అదే సెంటిమెంట్ ఫాలో అవ్వాలని భావిస్తున్నాడట. ఆర్డీటీ స్టేడియంలోని 9 వ నెంబర్ గదిని ఆల్రెడీ బాలయ్య టీం బుక్ చేసినట్లు సమాచారం. ఈసారి కూడా బాలయ్య హిందూపురంలో విజయం సాధిస్తాడు అని అంతా బలంగా నమ్ముతున్నారు. మరి ఈసారి బాలయ్య సెంటిమెంట్.. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.