March 21, 202501:30:38 AM

Kajal Aggarwal: సర్జరీ బాట పట్టిన కాజల్.. ఎందుకంటే..!

తేజ (Dharma Teja Jasti) దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీకళ్యాణం’ (Lakshmi Kalyanam) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ (Kajal Aggarwal).  ఆ సినిమాలో ఆమె లుక్స్ చూసి ఇంప్రెస్ అయ్యి కృష్ణవంశీ Krishna Vamsi ‘చందమామ’ (Chandamama) లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో ఆమెను మరింత అందంగా చూపించడంతో రాజమౌళి (S. S. Rajamouli) ‘మగధీర’ (Magadheera)  కోసం పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా కాజల్ ని పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా కలుపుకుని 50కి పైగా సినిమాల్లో నటించింది కాజల్.

అయితే 2020లో బిజినెస్ మెన్ అలాగే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడంతో కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. గతేడాది ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)  వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన కాజల్… ఈ ఏడాది ‘ఇండియన్ 2’ (Indian 2) ‘సత్యభామ’ (Kajal’s Satyabhama) వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం కాజల్ సర్జరీ చేయించుకుందట. కాజల్ సర్జరీ చేయించుకుంది ఆమె లిప్స్ కి అని తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆమె లిప్స్ కొంచెం బ్లాక్ కలర్లోకి మారాయట. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది కాబట్టి.. ఆమె ముందు జాగ్రత్తగా లిప్స్ కి సర్జరీ చేయించుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం పై కాజల్ అధికారికంగా ప్రకటించింది అంటూ లేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.