March 21, 202501:30:32 AM

Bhagavanth Kesari: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఓటీటీలో సైతం భగవంత్!

బాలయ్య (Nandamuri Balakrishna) అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి (Bhagavath Kesari) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 70 కోట్ల రూపాయలకు అటూఇటుగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. లియో (LEO) , టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలతో పోటీ లేకపోతే ఈ సినిమా మరింత బెటర్ కలెక్షన్లను సాధించి ఉండేది. స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కెరీర్ లో చివరి హిట్ ఏదనే ప్రశ్నకు సైతం ఈ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.

అయితే భగవంత్ కేసరి సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ మరో ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. జియో సినిమాలో భగవంత్ కేసరి హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. భగవంత్ కేసరి హిందీ వెర్షన్ ను చూడాలని భావించే అభిమానులకు వైరల్ అవుతున్న వార్త శుభవార్త అనే చెప్పాలి.

బాలయ్య సినిమాలకు హిందీలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటం వల్లే ఒకటి కంటే ఎక్కువ ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ కావాలని ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా బాలయ్యతో సినిమా తెరకెక్కించడానికి అనిల్ రావిపూడి సైతం సిద్ధంగానే ఉన్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య శైలికి అనుగుణంగా భగవంత్ కేసరి తెరకెక్కించి అనిల్ రావిపూడి బాలయ్య ఫ్యాన్స్ ను మెప్పించారు. ఈ సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఇచ్చిన సందేశం సైతం అద్భుతంగా ఉందని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యయి. బాలయ్య ఇతర నందమూరి హీరోలతో కలిసి నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నా ఇప్పట్లో అభిమానుల కోరిక నెరవేరడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరో బాలయ్య పుట్టినరోజుకు కొత్త ప్రాజెక్ట్స్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.