March 31, 202510:21:48 AM

చైసామ్ విడాకుల విషయంలో అసలు ట్విస్టులు ఇవేనా?

చైతన్య (Naga Chaitanya) సమంతలకు (Samantha) వేర్వేరుగా సోషల్ మీడియా వేదికగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పలు సర్వేలలో సమంత సైతం టాప్ లో నిలుస్తూ ప్రేక్షకుల్లో తన స్థానం ఇప్పటికీ పదిలంగానే ఉందని ఆమె చెప్పకనే చెప్పేస్తున్నారు. చైసామ్ మళ్లీ కలుస్తారని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తుండగా వాళ్లిద్దరూ కలవడం ఎప్పటికీ సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు చైసామ్ విడిపోయి ఏళ్లు గడుస్తున్నా వాళ్లిద్దరూ విడిపోవడానికి సంబంధించిన అసలు కారణం మాత్రం వెలుగులోకి రాలేదు.

అయితే ఫోన్ ట్యాపింగ్ వల్లే చైసామ్ విడిపోయారని గతంలో ప్రచారం జరగగా ఆ ప్రచారమే నిజమని ప్రముఖ బీజేపీ నేత కామెంట్లు చేశారు. చైసామ్ మధ్య ఫోన్ ట్యాపింగ్ చిచ్చు పెట్టిందని కామెంట్లు చేయడంతో ఈ వార్త ఒకింత సంతరించుకుంది. చైతన్య సమంత ఫోన్ ట్యాపింగ్ గురించి బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.

చైతన్య, సమంతలలో ఎవరో ఒకరు నోరు మెదిపే వరకు ఈ వార్తలు ఇలాగే కొనసాగే ఛాన్స్ అయితే ఉంది. చైసామ్ కొన్ని వారాల క్రితం ఒకే వేదికపై కొన్ని నిమిషాల పాటు కలిసి కనిపించడానికి సైతం ఎంతో ఇబ్బందులు పడ్డారు. అలాంటి చైతన్య, సమంత మళ్లీ ఒకే సినిమాలో కలిసి నటించడం కూడా సాధ్యమయ్యే పని కాదు. చైతన్య, సమంత రెమ్యునరేషన్లు కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉన్నాయి.

చైతన్యకు ఇతర భాషల్లో సైతం అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. తండేల్ (Thandel) సినిమాతో లవ్ స్టోరీ మ్యాజిక్ రిపీట్ కావడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో చైతన్య మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చైతన్య సాయిపల్లవి (Sai Pallavi) జొడీ సూపర్ జోడీ అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.