March 19, 202502:28:04 PM

Dil Raju, Allu Arjun: దిల్ రాజు .. అల్లు అర్జున్ భజన.. ‘ఐకాన్’ కోసమే..!

సినిమా వేడుకలు అంటేనే భజన చేసుకోవడం కోసం అనే ఓ అపోహ ఉంది. నాన్ స్టాప్ గా స్టేజ్ పై ఉన్న వాళ్ళు ఒకరినొకరు పొగుడుకోవడం కోసమే ఈ వేడుక అన్నట్టు ఇండస్ట్రీ జనాలు భావిస్తుంటారు. ఇక ఇలాంటి ఈవెంట్ కి ఎవరైనా స్టార్ హీరో గెస్ట్ గా వచ్చారు అంటే.. ఆ భజన ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇదంతా బయట జనాలకి మాత్రం నిజమే అనిపిస్తాయి. అందుకే సోషల్ మీడియాలో ఆయా వేడుకలకు సంబంధించిన వీడియోలు హాట్ టాపిక్ అవుతుంటాయి. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.

నిన్న ‘లవ్ మీ’ (Love Me)  ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లాంటి ఈవెంట్ ఒకటి జరిగింది. ఈ వేడుకలో ఆనవాయితీ ప్రకారం ఒకరినొకరు పొగుడుకున్నారు. ఓకే..! కానీ తర్వాత దిల్ రాజు (Dil Raju) .. సందర్భం లేకపోయినా అల్లు అర్జున్ భజన చేయడం మొదలుపెట్టారు. ఆశిష్ (Ashish Reddy) గురించి మాట్లాడుతున్న టైంలో దిల్ రాజు బన్నీ (Allu Arjun) టాపిక్ తీసుకొచ్చారు. ‘బన్నీని నేను చాలా దగ్గర నుండి చూశాను.అతనికి సినిమా తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఆశిష్ కూడా అంతే’ అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ‘లవ్ మీ’ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఎక్కువగా అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు.

ఆయన అందరి స్టార్ హీరోలతో పనిచేశారు. కానీ అల్లు అర్జున్ అంటే దిల్ రాజుకి ఓ ప్రత్యేకమైన ఇష్టం. ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్లో అల్లు అర్జున్.. ‘ఆర్య’ (Aarya) ‘పరుగు’ (Parugu) ‘డీజే'(దువ్వాడ జగన్నాథం) (Duvvada Jagannadham) వంటి సినిమాలు చేశాడు. ‘ఐకాన్’ అనే ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేశారు. కానీ అది సెట్స్ పైకి వెళ్ళలేదు. కచ్చితంగా ఈ సినిమా అల్లు అర్జున్ తో చేయించాలి అని దిల్ రాజు డిసైడ్ అయ్యారు. అందుకే ‘ఈ ప్రాజెక్టు ఆగిపోయింది’ అని అంతా అంటున్నా.. ‘అందులో నిజం లేదు అన్నట్టు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వచ్చారు’. కానీ రెండేళ్లుగా ‘ఐకాన్’ ప్రస్తావన తీసుకురావడం లేదు.

ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సో ‘పుష్ప’ (Pushpa: The Rise) ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి అర్జెంట్ గా అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలి అనేది దిల్ రాజు ఆలోచనగా తెలుస్తోంది. దాని వల్ల నార్త్ లో కూడా దిల్ రాజు బ్యానర్ కి మంచి గుర్తింపు వస్తుంది. మార్కెట్ ఏర్పడుతుంది. అదే దీని వెనుక ఉన్న కథ అని ఇండస్ట్రీ టాక్. మొన్నటి వరకు ఇదే టార్గెట్ గా ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకోవాలని దిల్ రాజు ప్రయత్నించారు. కానీ ప్రభాస్ వేరే ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో వర్కౌట్ కాలేదు. అందుకే బన్నీ భజన రాజు గారు ఎక్కువగా చేసుకున్నారని స్పష్టమవుతుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.