March 20, 202511:46:44 PM

Ram Charan: చరణ్‌ – బుచ్చిబాబు సినిమాలో తల్లిగా సీనియర్‌ హీరోయిన్‌.. కానీ ఆమె నో…

కొన్ని కాంబినేషన్లకు సంబంధించిన పుకార్లు వచ్చినవెంటనే అవి నిజం కావు అని తేలిపోతుంటాయి. అయితే ఆ పుకారు నిజమైతే బాగుండు అనే చర్చ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి చర్చ జరుగుతున్న కాంబినేషన్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) – విజయశాంతి (Vijayashanti). అవును చరణ్‌ కొత్త సినిమాలో తల్లిగా విజయశాంతి నటిస్తారు అని గత రెండు, మూడు రోజులు గా పుకార్లు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదు అని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఇదే చర్చగా మారింది.

రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శంకర్‌ (Shankar) ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) లేట్‌ అవుతోంది కానీ.. లేదంటే ఈపాటికే బుచ్చిబాబు సినిమా మొదలైపోయుండాలి. ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని సమాచారం. దీని కోసం పవర్‌ ఫుల్‌ నటిని తీసుకోవాలని టీమ్‌ అనుకుంటోంది. అప్పుడు విజయశాంతి పేరు చర్చలోకి వచ్చింది. చిరంజీవితో ఎన్నో హిట్స్‌ ఇచ్చిన ఆమె ఈ సినిమాలో నటిస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ కోరుకున్నారు.

అయితే ఇప్పుడు హఠాత్తుగా సినిమాల్లోకి మళ్లీ రావడం విజయశాంతికి ఇష్టం లేదట. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఈ సమయంలో మేకప్ వేసుకుని మళ్ళీ తెర మీద కనిపించే ఆలోచన ఆమెకు లేదు అని అంటున్నారు. అలాగే మళ్లీ చిరంజీవి (Chiranjeevi) ఫ్యామిలీతో సినిమానా అనే డౌట్‌ ఏమన్నా పడుతున్నారేమో అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆమెకు, చిరంజీవి మధ్య ‘నాట్‌ ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అని ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అప్పుడు చిరంజీవి మాటల్లోనే తెలిసింది.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. విలేజ్‌ – స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీపొడ్రక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా అయిన వెంటనే ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారట. అయితే నెక్స్ట్‌ సినిమాగా చేయబోయే సుకుమార్‌ ప్రాజెక్ట్‌ను కూడా పారలల్‌గా తెరకెక్కించాలని చూస్తున్నారట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.