
యాంకర్లు.. ఈవెంట్లను హోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం అనేది చూస్తూనే ఉంటాం. హీరోలు, హీరోయిన్లతో పాటు ఆ ఈవెంట్లను హోస్ట్ చేసే యాంకర్లు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఈ క్రమంలో కొందరు యాంకర్లు ఎక్కువ హైలెట్ అవ్వడం కోసం హీరోయిన్లను మించి స్కిన్ షో చేస్తూ ఫోటో షూట్‌లలో పాల్గొంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొందరు మాత్రం వీటికి చాలా దూరంగా ఉంటారు.
అలాగే స్పెషల్ గా కనిపిస్తారు. ఇప్పటివరకు ఈ లిస్ట్ లో ఝాన్సీ (Jhansi) , సుమ (Suma Kanakala) మాత్రమే ఉన్నారు. ‘యాంకరింగ్ ఇంత హుందాగా కూడా చేయవచ్చా?’ అనేందుకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు వాళ్ళు. అయితే సుమ తర్వాత అలా ఈవెంట్ ను అందంగా హోస్ట్ చేసే యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కచ్చితంగా గీతా భగత్ అనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. మొదటి నుండి ఈమె హోస్టింగ్ చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
మూవీ ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో ఇలా వేడుక ఏదైనా సరే గీతా భగత్ స్పెషల్ గా నిలుస్తుంటుంది .ఈమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పాలి. సెలబ్రిటీలను ఏమాత్రం నొప్పించకుండా వారు కూడా టెన్షన్ ని పక్కన పెట్టి ఈవెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేసేలా చేస్తుంది గీతా. రజినీకాంత్ నుండి టాలీవుడ్ స్టార్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన ఘనత కూడా ఈమె సొంతం.
కాంట్రోవర్సీలకి దూరంగా ఉంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న గీతా భగత్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలతో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఈమె ఫోటో షూట్లు ‘చాలా బ్యూటిఫుల్’ అనే విధంగా ఉంటాయి. అందుకే ‘సుమ తర్వాత నువ్వే’ అంటూ గీతా గురించి స్పందిస్తూ ఉంటారు నెటిజెన్లు. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram