March 22, 202507:31:38 AM

Kalki 2898 AD: కల్కి మేకర్స్ కు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే.. అదే మైనస్ అంటూ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli)  తన సినిమాలకు ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తక్కువ ఖర్చుతో అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీలతో సినిమాను ప్రమోట్ చేసే విధానానికి ఎవరైనా ఫిదా కాక తప్పదు. కల్కి (Kalki 2898 AD) సినిమా ప్రమోషన్స్ తాజాగా ఒక ఈవెంట్ తో మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో బుజ్జిని పరిచయం చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. బుజ్జి అనేది వాహనమే అయినా సినిమాలో ఆ పాత్రే కథను మలుపు తిప్పనుందని కల్కి ట్రైలర్ తోనే ఆ పాత్ర పవర్ ఏంటో క్లారిటీ రానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే కల్కి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ మరీ భారీ రేంజ్ లో చేయకపోయినా భారీగానే కలెక్షన్లు వస్తాయి. ప్రమోషన్స్ భారీగా చేస్తే ఆ కలెక్షన్లు మరింత పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో ప్రభాస్  (Prabhas)  సినిమాలకు సరైన స్థాయిలో ప్రమోషన్స్ చేయడం లేదనే విమర్శ ఉంది. కల్కి మేకర్స్ ఆ లోటు తీర్చాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాజమౌళి రేంజ్ లో కల్కి సినిమాకు మేకర్స్ ప్రమోషన్స్ చేయాలని అభిమానులు భావిస్తుండగా అలా చేయడం సాధ్యమవుతుందో లేదో చూడాలి.

కల్కి ప్రమోషన్స్ కు సంబంధించి నాగ్ అశ్విన్ (Nag Ashwin)  దగ్గర కూడా అద్భుతమైన ఐడియాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆ ఐడియాలను ఫాలో అయితే మాత్రం కల్కి టీమ్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సినిమా అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కల్కి 2898 ఏడీ సినిమాకు ప్రముఖ టెక్నీషియన్లు పని చేశారు. సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా కోసం తన వంతు సలహాలు, సూచనలు అందించారు. ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు సైతం భారీ స్థాయిలో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కల్కి సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ కావడంతో ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.