March 20, 202511:57:01 PM

Keerthy Suresh: కీర్తి సురేశ్‌ కొత్త బయోపిక్‌.. ఆ స్థాయి విజయం, పేరు వస్తాయా?

జీవిత కథలు తెరకెక్కించడమే కాదు.. నటించడమూ కష్టమే. కాస్త అటు ఇటు అయితే ఇప్పుడు ఉన్న ఈ ట్రోలర్ల పంచాయితీకి నానా కష్టాలు పడాల్సిందే. ఇలాంటి సమయంలో ప్రముఖ నటి, దివంగత మహానటి సావిత్రి (Savitri) జీవిత కథలో నటించి మెప్పించిన అందం కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). ఏకంగా సినిమా పేరును ఆ తర్వాత ఇంటి పేరుగా మార్చేసుకుంది కీర్తి. అయినా.. ఇప్పుడు ఆమె గురించి ఎందుకీ చర్చ అనే డౌట్‌ మీకు వచ్చే ఉంటుంది.

ఎందుకంటే ఇప్పుడు ఆమె మరో బయోపిక్‌ చేస్తుంది అని టాక్‌. దేశంలోని అన్ని సినిమా పరిశ్రమల్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. వివిధ రంగాలలో గుర్తింపు పొందిన వారి బయోపిక్స్ ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాంటి బయోపిక్స్‌లో ఎం.ఎస్ సుబ్బలక్ష్మి (M. S. Subbulakshmi) జీవిత కథ ఒకటి. సంగీతానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ సినిమాగా తెరకెక్కించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అందులోనే ఇప్పుడు కీర్తి నటిస్తోందని టాక్‌. ‘మహానటి’ (Mahanati) సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయిన తీరు చూసిన అభిమానులు.. ఇప్పుడు ‘ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి’ పాత్రలో కూడా అదే స్థాయిలో నటించి మెప్పిస్తుందని ఆశిస్తున్నారు. మరి కీర్తి ఆ పాత్రలో నటిస్తుందా? నటిస్తే ‘మహానటి’ స్థాయిలో మెప్పిస్తుందా అనేది చూడాలి. అయితే కీర్తి సురేశ్ నటన గురించి తెలిసినవాళ్లు ఆమె నూటికి నూరు శాతం అదరగొడుతుందని చెబుతున్నారు.

ఇక కీర్తి సినిమాల సంగతి చూస్తే.. తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఒక హిందీ సినిమా కూడా చేస్తోంది. తమిళ సినిమాలు ‘రఘుతాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివీడి’ కాగా.. హిందీలో ‘బేబీ జాన్‌’ అనే సినిమా చేస్తోంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’లో (Kalki 2898 AD) బుజ్జి అనే స్పెషల్‌ కారుకు వాయిస్‌ ఇచ్చింది కీర్తి సురేశ్‌. ఆ సినిమా జూన్‌ 27న విడుదలవుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.