March 21, 202501:01:39 AM

Koratala Siva: కొరటాలని భయపెడుతున్న ఆనిరుథ్?

అల్లు అర్జున్  (Allu Arjun) – సుకుమార్  (Sukumar) ..ల కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule)  నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవల రిలీజ్ అయ్యింది. మొదట దీని పై నెగిటివ్ రెస్పాన్స్ వినిపించినా.. యూట్యూబ్ లో ఈ సాంగ్ బాగానే ట్రెండ్ అవుతుంది. లిరికల్ సాంగ్స్ లో రికార్డులు సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. అది పక్కన పెడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ (Jr. NTR) – కొరటాల శివ(Koratala Siva) .. వంతు వచ్చింది. ‘దేవర పార్ట్ 1 ‘ (Devara)  ఫస్ట్ సింగిల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక ఉంది. ఆ టైంకి కచ్చితంగా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ ఆ రేంజ్లో ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  వల్ల ఎన్టీఆర్ కెరీర్లో అనుకోకుండా గ్యాప్ వచ్చినట్టు అయ్యింది. సరే అది పక్కన పెట్టేస్తే.. ఇప్పటికే ‘దేవర పార్ట్ 1 ‘ కి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి ఆనిరుథ్ (Anirudh Ravichander)  అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కాబట్టి.. ఫస్ట్ సింగిల్ కూడా అదే స్థాయిలో ఉంటుంది అని అభిమానులు ఆశపడుతున్నారు.

అయితే మరోపక్క ఆనిరుథ్ ఇంకా ఫస్ట్ సింగిల్ ను రెడీ చేయలేదట. దీంతో దర్శకుడు కొరటాల శివకి టెన్షన్ మొదలైంది. కచ్చితంగా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు సాంగ్ ఇవ్వాలి. లేదు అంటే ఎన్టీఆర్ అభిమానులు తిట్టిపోయడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో కొరటాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.