Ram Charan: చరణ్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన అభిమానులు.. ఏంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం సినిమాల పరంగా టాలీవుడ్ టాప్5 హీరోలలో ఒకరిగా ఉన్నారు. రామ్ చరణ్ సినిమాలకు సులువుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుగుతుండగా చరణ్ కు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతోంది. రామ్ చరణ్ పిఠాపురానికి పవన్ (Pawan Kalyan) కోసం వెళ్లడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ప్రేమగా జనసేనాని అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే.

అయితే రామ్ చరణ్ కు మాత్రం ఫ్యాన్స్ కొత్త ట్యాగ్ ఇచ్చారు. రామ్ చరణ్ ను ఫ్యాన్స్ ప్రేమగా యువసేనాని అని పిలుచుకుంటున్నారు. చరణ్ కు పాలిటిక్స్ పై ఆసక్తి ఉందో లేదో తెలీదు కానీ అభిమానులు ఇచ్చిన ఈ ట్యాగ్ మాత్రం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాలో సైతం పొలిటికల్ టచ్ ఉండబోతుందని తెలుస్తోంది.

రామ్ చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతుండగా ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తే చరణ్ కు క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ కు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని ఆర్.ఆర్.ఆర్ ను (RRR) మించిన హిట్లను రామ్ చరణ్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చరణ్ గత సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఆచార్య (Acharya) సినిమా మల్టీస్టారర్ మూవీ కావడంతో ఆ ప్రభావం రామ్ చరణ్ కెరీర్ పై పడలేదు. రామ్ చరణ్ లైనప్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటుండగా పాన్ వరల్డ్ స్థాయిలో చరణ్ సినిమాలు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావించారు. చరణ్ కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.