March 18, 202502:38:59 PM

Kovai Sarala: చనిపోయారని తెలిసినా డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి.. కోవైసరళ ఎమోషనల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా కోవై సరళ (Kovai Sarala) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆమె కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కోవై సరళ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయిన మరో లేడీ కమెడియన్ లేరనే చెప్పాలి. కోవై సరళ వయస్సు ప్రస్తుతం 62 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో కోవై సరళ తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించలేదనే సంగతి తెలిసిందే. బాక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన కోవై సరళ ఒకప్పుడు కోయంబత్తూరుని కోవై అని పిలిచేవారు తాను కోయంబత్తూరులో ఉండటంతో నా పేరు కోవై సరళ అయిందని ఆమె అన్నారు. నాకు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నారని కోవై సరళ వెల్లడించారు.

అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని ఒక సినిమా షూటింగ్ కొరకు ఊటీకి వెళ్లిన సమయంలో నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసిందని కోవై సరళ అన్నారు. అక్కడ ఒక పాట షూట్ జరుగుతోందని అందరూ వచ్చారని ఆ సాంగ్ లో నేను బ్యాండ్ కొడుతూ సందడి చేయాలని ఆమె వెల్లడించారు. నాన్న చనిపోయారనే వార్త తెలిసి కూడా నేను ఆ పాటకు డ్యాన్ చేశానని కోవై సరళ అన్నారు.

అది చిన్న ప్రొడక్షన్ అని ఆర్టిస్టులందరూ వచ్చారని ఆమె కామెంట్లు చేశారు. నేను వెళ్లిపోతే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. దాని వల్ల నిర్మాత నష్టపోయే అవకాశం ఉందని కోవై సరళ కామెంట్లు చేశారు. అందుకే ఆ పాట పూర్తి చేసి వెళ్లానని ఆమె తెలిపారు. మా నాన్నగారి చివరి చూపు చూసుకోలేకపోయానని కోవై సరళ పేర్కొన్నారు. బంధువులంతా నన్ను విమర్శించారని ఆమె తెలిపారు. అసలు విషయం వాళ్లకు తెలియదని నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారని కోవై సరళ వెల్లడించారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.