March 24, 202510:52:33 AM

Manam Collections: 10 ఏళ్ళ ‘మనం’.. ఫైనల్ గా కలెక్ట్ చేసింది ఎంతో తెలుసా?

‘మనం’ (Manam) చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు.కేవలం ఇది క్లాసిక్ అంటే సరిపోదు. ఇది మంచి ఎక్స్పీరియన్స్ కూడా..! ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై అక్కినేని నాగార్జున (Nagarjuna)  నిర్మించిన ఈ చిత్రాన్ని విక్రమ్ కె కుమార్ (Vikram kumar) డైరెక్ట్ చేశాడు. అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)  , దివంగత అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao)  కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ (Akhil)  , అమల (Amala) కూడా గెస్ట్ రోల్స్ చేశారు. శ్రీయ (Shriya Saran ) ,సమంత  (Samantha Ruth Prabhu).. హీరోయిన్లు. అక్కినేని నాగేశ్వర రావు చివరి చిత్రంగా ‘మనం’ రిలీజ్ అయ్యింది.

‘ఆయన ఇక లేరు’ అనే ఆలోచనల్ని ఈ సినిమా దూరం చేసింది అని అక్కినేని అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. ఈ సినిమా చూస్తుంటే నిజంగా అందరికీ అదే ఫీలింగ్ కలుగుతుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. 2014 మే 23న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నేటితో ‘మనం’ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద మనం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

నైజాం 11.20 cr
సీడెడ్ 3.90 cr
ఉత్తరాంధ్ర 3.30 cr
ఈస్ట్  2.10 cr
వెస్ట్  1.50 cr
గుంటూరు  2.25 cr
కృష్ణా  2.00 cr
నెల్లూరు  1.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  27.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   3.00 cr
ఓవర్సీస్  6.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 36.65 cr

‘మనం’ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఆ టార్గెట్ ను మొదటి వారమే రీచ్ అయిన ఈ సినిమా ఫైనల్ గా రూ.36.65 కోట్ల షేర్ ను రాబట్టి.. డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.