March 24, 202510:22:19 AM

Kajal Aggarwal: వైరల్ అవుతున్న కాజల్ ఓల్డ్ వీడియో.. ఆ హీరోతో కెమిస్ట్రీ బాగుంటుందంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ (Kajal Aggarwal) ఒకవైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు. కాజల్ నటించిన సత్యభామ (Kajal’s Satyabhama) మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు ఈ సినిమా కాజల్ అగర్వాల్ కెరీర్ లో మరో మెమరబుల్ మూవీగా మిగులుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనుష్క (Anushka Shetty) , కీర్తి సురేష్ (Keerthy Suresh) లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో కాజల్ అగర్వాల్ కూడా నిలుస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ స్టార్ హీరోల లుక్స్ కు రేటింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్  (Prabhas), రామ్ చరణ్ (Ram Charan)  , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లకు లక్కీ హీరోయిన్ అయిన కాజల్ స్టార్ హీరో ప్రభాస్ లుక్స్ కు 8 రేటింగ్ ఇచ్చారు. కాజల్ ఇచ్చిన రేటింగ్ ఇదే హైయెస్ట్ కావడం గమనార్హం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు లుక్స్ పరంగా 6 రేటింగ్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్ కు 5 రేటింగ్ ఇచ్చారు.

టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని 6 రేటింగ్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్ కు మాత్రం 6 రేటింగ్ ఇచ్చారు. మరో స్టార్ హీరో రామ్ చరణ్ కు కూడా ఈ బ్యూటీ 7 రేటింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్, బన్నీలకు కాజల్ 7 రేటింగ్ ఇచ్చినా బాగుండేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఓల్డ్ వీడియో అని ఇప్పుడు అయితే కాజల్ మరింత ఎక్కువ రేటింగ్ ఇచ్చేవారని కొంతమంది హీరోల ఫ్యాన్స్ చెబుతున్నారు.

కాజల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కాజల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.