March 20, 202511:36:53 AM

Manam: ఆ స్పెషల్ డే కానుకగా మనం రీరిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్ హిట్ చేస్తారా?

అక్కినేని హీరోల కెరీర్ లో మనం (Manam) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను అందించింది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) చివరి సినిమా కావడంతో పాటు ఈ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉంటుంది. ఈ మూవీ కథనంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయనే సంగతి తెలిసిందే. మనం సినిమా తన కెరీర్ లో స్పెషల్ మూవీ అని నాగ్ సైతం చెబుతారు.

మే నెల 23వ తేదీన ఈ సినిమా రీరిలీజ్ కానుంది. సినిమా విడుదలై పది సంవత్సరాలు కావడంతో ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను రీమేక్ చేసే సాహసం కూడా చేయలేరనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ అక్కినేని ఫ్యామిలీ కోసమే పుట్టిందని అక్కినేని హీరోలు మాత్రమే జీవం పోశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సమంత (Samantha Ruth Prabhu) , శ్రియలకు (Shriya Saran )కూడా ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు భవిష్యత్తులో సీక్వెల్ దిశగా అడుగులు పడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మనం సినిమాకు సీక్వెల్ వస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. మరోవైపు నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం వరుస మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తూ ఫ్యాన్స్ ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నాగార్జున రెమ్యునరేషన్ 12 నుంచి 13 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రస్తుతం నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాలు నాగార్జున రేంజ్ ను మరింత పెంచుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) , అక్కినేని అఖిల్ (Akhil) సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. అక్కినేని అఖిల్ కు మాత్రం కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ దక్కాల్సి ఉంది. అక్కినేని యంగ్ హీరోల తర్వాత ప్రాజెక్ట్స్ ఒకింత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఆయా హీరోల అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.