March 23, 202508:25:20 AM

Naga Chaitanya: ‘మనం’ రీ-రిలీజ్:ఆ విషయంలో చైతన్య హర్ట్ అయ్యాడా.. వీడియో వైరల్

నిన్నటితో అంటే మే 23 తో ‘మనం’  (Manam)  సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తయ్యింది. దీంతో ఆ సినిమాని స్పెషల్ షో వేయించుకుని అభిమానులతో వీక్షించింది టీం. అందరికీ ఇదో క్లాసిక్ సినిమా. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అక్కినేని అభిమానులకి ఇది భావోద్వేగాలతో కూడిన అందమైన జ్ఞాపకం.పైగా దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గారు నటించిన చివరి సినిమా కావడంతో.. వారికి ఇది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు.

చాలా భాషల్లో ‘మనం’ ని రీమేక్ చేయాలని ప్రయత్నించారు. కానీ ఇది ఎవ్వరికీ సెట్ అవ్వదు అని భావించి లైట్ తీసుకున్నారు. అక్కినేని ఫ్యామిలీకి మాత్రమే కరెక్ట్ గా సెట్ అయిన మూవీ ఇది. ఇక నిన్నటి ‘మనం’ స్పెషల్ షోకి అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) అండ్ టీంతో పాటు సుప్రియా యార్లగడ్డ (Supriya Yarlagadda) కూడా హాజరైంది. సినిమా చూస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి విజువల్స్ రాగానే ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. మరోపక్క సమంతతో (Samantha Ruth Prabhu) పెళ్లి సీన్లు వచ్చినప్పుడు ఫ్యాన్స్ బాగా గోల చేశారు.

దీంతో నాగ చైతన్య ఇరిటేట్ అయినట్టు కొన్ని విజువల్స్ వైరల్ అవుతున్నాయి. 2021 లో నాగ చైతన్య.. సమంతతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఫ్యాన్స్ ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అప్పటివరకు బెస్ట్ కపుల్, క్యూట్ కపుల్.. అనుకుని మురిసిపోయిన ఫ్యాన్స్ ని అది పెద్ద షాక్..లోకి నెట్టేసినట్లు అయ్యింది అని చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.