March 15, 202512:18:47 PM

Pawan Kalyan: ఎమ్మెల్యే గారి తాలూకా టైటిల్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. కానీ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినిమాలలో చాలా సినిమాలకు టైటిల్స్ కొరత వేధిస్తోంది. కథకు అనుగుణంగా టైటిల్ ను ఫిక్స్ చేసే విషయంలో దర్శకనిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలుగా టాలీవుడ్ స్టార్స్ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని భాషలకు ఒకే టైటిల్ ను ఫిక్స్ చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని టైటిళ్లకు సంబంధించి వివాదాలు కూడా తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసిన నేపథ్యంలో కొందరు అభిమానులు “పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా” అంటూ జనసేన సింబల్ తో స్టిక్కర్లను వాహనాలకు అంటించుకుని తిరుగుతున్నారు.

అభిమానులు చేసిన ఈ పని వల్ల ఎమ్మెల్యేగారి తాలూకా అనే టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఒక మీడియం రేంజ్ నిర్మాత ఈ టైటిల్ ను రిజిష్టర్ చేయించే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం టైటిల్ అదుర్స్ అనేలా ఉందని ఈ టైటిల్ తో పవన్ తో సినిమా ప్లాన్ చేస్తే తమ సంతోషానికి అవధులు ఉండవని చెబుతున్నారు.

అయితే అద్భుతమైన స్క్రిప్ట్ ఉంటే మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ టైటిల్ తో తెరకెక్కే సినిమాలో నటించే అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), ఓజీ (OG Movie)సినిమాలకు డేట్లు కేటాయిస్తానని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఓజీ వాయిదా పడటం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ ఏడాది పవన్ నటించిన ఒక్క సినిమా అయినా కచ్చితంగా విడుదలవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మాత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. పవన్ సినిమాలన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.