March 21, 202501:11:04 AM

Prasanna Vadanam: సుహాస్ ‘ప్రసన్నవదనం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సుహాస్ (Suhas) హీరోగా మారి ఇప్పటికే ‘కలర్ ఫోటో’ (Colour Photo) ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) ‘అంబాజీపేట మ్యారేజీ బాండు’ (Ambajipeta Marriage Band) వంటి సినిమాలు చేశాడు. అన్నీ సక్సెస్ సాధించాయి. అందుకే అతని లేటెస్ట్ మూవీ ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) పై కూడా మంచి బజ్ ఏర్పడింది. సుకుమార్ (Sukumar ) శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), రాశి సింగ్ హీరోయిన్స్. ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

అందుకే ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.25 cr
సీడెడ్ 0.45 cr
ఆంధ్ర(టోటల్) 1.40 cr
ఏపీ + తెలంగాణ 3.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 cr
ఓవర్సీస్ 0.60 cr
వరల్డ్ వైడ్ టోటల్ 4.00 cr

‘ప్రసన్నవదనం’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే… టార్గెట్ రీచ్ అవ్వడం చాలా ఈజీ అనే చెప్పాలి. పైగా ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు.కాస్తో కూస్తో అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) పై బజ్ ఉంది. సో ‘ప్రసన్నవదనం’ కి బెటర్ టాక్ వస్తే ఆ సినిమా పెర్ఫార్మన్స్ తో ఇబ్బంది లేకుండానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.