March 18, 202503:01:37 AM

Pawan Kalyan: పవన్‌ ఎక్కడుంటే అక్కడ అకీరా.. పవర్‌ స్టార్‌ ఏం చేస్తున్నాడు?

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) – అకీరా నందన్‌ ఎప్పుడైనా, ఎక్కడికైనా కలసి వెళ్లడం చూశారా? ఈ ప్రశ్నేంటి.. ఇలా అడిగారు అని అనుకుంటున్నారా? ఎప్పుడూ లేనిది ఇప్పుడు జరుగుతోంది కాబట్టి. కావాలంటే మీరే చూడండి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కాస్త పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ అయ్యాక చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అందులో ఓ మార్పు పవన్‌ ఎక్కడికెళ్లినా పక్కనే అకీరా నందన్‌ కూడా ఉంటున్నాడు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినా పక్కనే ఉన్నాడు.

అంతకుముందు తెదేపా అధినేత చంద్రబాబు.. పవన్‌ ఇంటికి వచ్చినప్పుడు కూడా అకీరా ఉన్నాడు. దీంతో పవన్‌ ప్లానేంటి? వారసుడిని ఇప్పుడు వెంట పెట్టుకుని తిరగడం వెనుక ఆలోచన ఏంటి? అనే చర్చ మొదలైంది. తన వారసుడిగా అకీరాను పవన్‌ ఇలా పరిచయం చేస్తున్నాడా? అనే డిస్కషన్‌ జోరుగా సాగుతోంది. మామూలుగా అకీరా పుణెలో తల్లి రేణు దేశాయ్‌ (Renu Desai) దగ్గర ఉంటాడు. పవన్‌ అప్పుడప్పుడు అకీరాను, ఆద్యను చూడటానికి వెళ్తుంటాడు.

అకీరా, ఆద్య కూడా పవన్‌ దగ్గరకు వస్తారు కానీ, పెద్దగా ఎవరికీ కనిపించరు. అయితే మెగా ఫ్యామిలీ ఏటా జరుపుకున్న పండగ లాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటారు. అయితే, ఏపీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి అనగానే అకీరా.. పవన్‌ వద్దకు చేరిపోయాడు. హైదరాబాద్‌లో ఇంటి దగ్గర కనిపించాడు. ఆ తర్వాత విజయవాడలో కనిపించాడు. మొన్న దిల్లీలో కనిపించాడు. నిన్న చిరంజీవి ఇంట్లో కనిపించాడు. దీంతో అకీరాను అప్పుడప్పుడు చూసే ఫ్యాన్స్‌ ఇప్పుడు రోజూ చూస్తున్నారు.

ఇదే ఫ్లో కొనసాగితే జూన్‌ 12న జరిగే చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా అకీరా రావొచ్చు. అయితే లో ప్రొఫైల్‌లో ఉన్న అకీరా.. ఎందుకు ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నాడు. దీనికి ఆన్సర్‌ పవన్‌ తన తనయుడిని వారసుడిగా అందరికీ ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలకు పరిచయం చేయడం ఒకటి అయితే.. రెండోది నెక్స్ట్‌ పవర్‌ స్టార్‌ వీడే అని చెప్పడం మరొకటి అని అంటున్నారు. మరి పవన్‌ మనసులో ఏముందో ఏమో?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.