March 20, 202508:52:18 PM

Rajinikanth: ఆ జాబితాలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. సంతోషంలో ఫ్యాన్స్!

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఏడు పదుల వయస్సులో కూడా విశ్రాంతి లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ వేట్టయాన్ అనే సినిమాలో నటిస్తుండగా రానా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రజనీకాంత్ కు గోల్డెన్ వీసా దక్కడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. యూఏఈ ప్రభుత్వం వేర్వేరు రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించడానికి గోల్డెన్ వీసాను అందిస్తోంది. భారత్ నుంచి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ గోల్డెన్ వీసాను అందుకున్న వారి జాబితాలో ఉన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా గోల్డెన్ వీసా పొందారనే సంగతి తెలిసిందే. వీసా పొందిన తర్వాత రజనీకాంత్ మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వెకేషన్ కోసం రజనీకాంత్ దుబాయ్ కు వెళ్లగా అబుదాబిలో జరిగిన ఒక ప్రోగ్రామ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయనకు గోల్డెన్ వీసా అందించింది. రజనీకాంత్ యూఏఈ అధినేతలతో పాటు లూలూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

పదేళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ వీసాలను అందిస్తోంది. ఈ గోల్డెన్ వీసాను కలిగి ఉన్నవాళ్లు ఆ దేశంలో సొంతంగా బిజినెస్ లను నిర్వహించడంతో పాటు ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు. రజనీకాంత్ కు అరుదైన గౌరవం దక్కడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా రజనీకాంత్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో కూడా రజనీకాంత్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.